Manickam Tagore: మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అక్కడ పార్టీలు పోటాపోటీగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెడుతున్నాయి. దీంతో.. అటు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ర్యాలీలు.. సభలతో ప్రదర్శిస్తుంటే, మరోసారి మునుగోడులో కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలని వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ మునుగోడులో తమ పార్టీని మరోసారి గెలిపించేందుకు అన్ని మార్గాలను వెతుక్కుంటోంది. ఇక మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలిచే అభ్యర్థిని ప్రకటించేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఈనేపథ్యంలో..తమ అభ్యర్థిని ప్రకటించేందుకు అవసరమైన చర్యలు తీసుకునే దిశలో కాంగ్రెస్…