కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ అధ్యక్షతన టీ.కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఈ సీనియర్ల సమావేశంలో వాడి వేడిగా జరిగినట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకులకు టాగూర్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. టైం సెన్స్ లేకుంటే పద్దతి కాదని, 11 గంటలకు మీటింగ్ అంటే… పనెండున్నర కి రావడం ఏంటి..? మాణిక్కం ఠాగూర్ ప్రశ్నించారు. మీకు సమయం విలువ తెలియకపోవచ్చు…మాకు టైం ఇంపార్టెంట్ తెలుసన్న ఠాగూర్.. వరుసగా మూడు సమావేశాలకు రాకుంటే… నోటీసులు ఇస్తానని హెచ్చరించారు.…
సీఎల్సీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తన పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత మళ్లీ పాదయాత్ర తిరిగి ప్రారంభించారు.. పాదయాత్రలో ఉన్న ఆయన.. ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీతో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక భేటీకి కూడా వెళ్లలేదు.. దీనిపై ముందుగానే అధిష్టానానికి సమాచారం ఇచ్చారు.. మరోవైపు.. పాదయాల్రలో ఉన్న సీఎల్పీ నేత భట్టికి ఫోన్ చేశారు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్..…
ఆ MLCని పాత గాయం వెంటాడుతూనే ఉంది. ఇంకా కోలుకో లేదు. పార్టీలో అన్నింటికీ ముందుండే పెద్దాయన ఇప్పుడు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తన పనెంటో తాను చూసుకుని వెళ్లిపోతున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయన ఎందుకు అలిగారు? కాంగ్రెస్ కార్యక్రమాలకు టచ్ మీ నాట్‌గా జీవన్‌రెడ్డితెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి. పార్టీకి విధేయుడు. ప్రస్తుతం ఎమ్మెల్సీ. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్‌పై పోటీ చేయడానికి పార్టీ నుంచి ఎవరూ ముందుకురాని సమయంలో మంత్రి…
తెలంగాణ విషయంలో మోడీ వ్యాఖ్యలు రాజకీయాలను వేడెక్కించాయనే చెప్పాలి. తెలంగాణ విషయంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జి, మానిక్కం ఠాకూర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. నాటిఉద్యమ నాయకులు , సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజా పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల కాదు. అహింసా మార్గంలో కేసీఆర్ చేపట్టిన పోరాటంలో ప్రజలంతా ఆయనతో కలిసి రావడం, ఆనాడు ప్రభుత్వంలో…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది… ఇప్పటి వరకు పార్టీలో ఉన్న నియామక ప్రక్రియకు స్వస్తి చెప్పాలని నిర్ణయించింది… ఇవాళ హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వేదికగా పార్టీ రాష్ట్ర వ్యవహారల ఇంచార్జ్ ఠాగూర్ అధ్యక్షతన డీసీసీ అధ్యక్షుల సమావేశం జరిగింది… సభ్యత్వ నమోదుపై కీలకంగా చర్చించారు పార్టీ నేతలు.. మరోవైపు, పార్టీ ఎన్నికల నియమావళిని కూడా మార్చేందుకు నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ… గ్రామ శాఖ అధ్యక్షులకు కూడా ఎన్నికలే నిర్వహించాలని నిర్ణయించింది… ఇప్పటి వరకు…
తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకులకు స్వేచ్ఛ ఎక్కువ. పార్టీలో సోనియాగాంధీ.. రాహుల్ గాంధీలను తప్ప.. ఎవరినైనా ఏదైనా అనేయొచ్చు. దీన్నే కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు. ఈ వైఖరే ఇటీవల పెద్ద తలనొప్పికి దారి తీసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మొదలుకుని.. క్రమశిక్షణ కమిటీ వరకు… రచ్చ రచ్చ అయింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో రాజీనామాల వరకు వెళ్లిందా వ్యవహారం. ఈ అంశంపై సీనియర్ నాయకులు కూడా కొంత అసంతృప్తితో ఉన్నారట. మాజీ మంత్రి జానారెడ్డి లాంటి…
రాజీనామా అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొట్టిపారేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు రాజీనామా చేసే ఉద్దేశం లేదని ప్రకటించారు. పీఏసీ భేటీలో తన ఆవేదనని మాణిక్కం ఠాగూర్‌కి చెప్పానని తెలిపారు. సంక్రాంతి తర్వాత కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్‌గాంధీని కలుస్తానని తెలిపారు. Read Also: ప్రధానిని అడ్డుకోవడం రాజకీయ కుట్ర: జీవీఎల్ తన స్టాండ్ ఎప్పుడూ కాంగ్రేసేనని స్పష్టం చేశారు. తన వల్ల ఎవరికైనా ఇబ్బందైతే.. ఇండిపెండెంట్‌గానే ఉంటానని, ఏ పార్టీలోకి…
కాంగ్రెస్ పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నాలుగు గంటలపాటు కొనసాగింది. జూమ్ ఆప్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్‌చార్జ్ మానిక్కమ్ ఠాగూర్ అధ్యక్షత వహించారు. కన్వీనర్‌గా షబ్బీర్ ఆలీ సమావేశాన్ని కొనసాగించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు మిగిలిన పీఏసీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానిక్కమ్ ఠాగూర్ మాట్లాడుతూ .. పార్టీకి దిశానిర్దేశం చేశారు. ఏఐసీసీ ప్రకటించిన కార్యక్రమాలను కింది స్థాయి నుంచి చేపట్టాలని పిలుపునిచ్చారు. Read Also:పీఆర్సీ పై…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు కీలక ఆదేశాలు ఇచ్చారు టి. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్.. తెలంగాణలో 30 లక్షల పార్టీ సభ్యత్వాలు చేయించాలని సూచించిన ఆయన.. ఇక, వచ్చే ఎన్నికల్లో 80 లక్షల ఓట్లు టార్గెట్ గా పెట్టుకుని పనిచేయాలని ఆదేశించారు.. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 78 స్థానాలను గెలవడమే టార్గెట్‌గా పెట్టుకోవాలని.. అందరూ అది దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని సూచించారు.. ప్రతీ బూత్ కు ఒక లీడర్‌ను తయారు…
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.. కొన్ని రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యం సాధిస్తున్నా.. మొత్తంగా మాత్రం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్‌లో కొనసాగుతున్నారు.. ఇక, ఈ ఫలితాల్లో కాంగ్రెస్ మాత్రం అనుకున్న స్థాయిలో ప్రభావాన్ని చూపించలేకపోతోంది.. టీఆర్ఎస్-బీజేపీ మధ్య నువ్వా నేనా అనే తరహాలో ఫైట్ నడుస్తున్నా.. కాంగ్రెస్ లెక్కలోకి తీసుకోవాల్సిన పరిస్థితి లేకుండా పోయింది. ఇక, ఈ ఫలితాలపై కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ ఇలా స్పందించారు.…