Manickam Tagore: నేడు నగరానికి మాణిక్కం ఠాగూర్.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరుపై ఉత్కంఠ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manickam Tagore: మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అక్కడ పార్టీలు పోటాపోటీగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెడుతున్నాయి. దీంతో.. అటు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ర్యాలీలు.. సభలతో ప్రదర్శిస్తుంటే, మరోసారి మునుగోడులో కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలని వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ మునుగోడులో తమ పార్టీని మరోసారి గెలిపించేందుకు అన్ని మార్గాలను వెతుక్కుంటోంది. ఇక మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలిచే అభ్యర్థిని ప్రకటించేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఈనేపథ్యంలో..తమ అభ్యర్థిని ప్రకటించేందుకు అవసరమైన చర్యలు తీసుకునే దిశలో కాంగ్రెస్ అధిష్టానం చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ హైదరాబాద్ రానున్నారు. నేడు గాంధీభవన్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నేతలతో పాటు, మునుగోడు నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈచర్చలో.. మునుగోడు అభ్యర్థి ఎంపిక వ్యవహారాన్ని నల్గొండ జిల్లా సీనియర్ నాయకులకు వదిలేయడంతో, ఇవాళ జిల్లాకు చెందిన సీనియర్లతో ఠాగూర్ సమావేశమై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక జానారెడ్డి, దామోదర్‌రెడ్డి, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలను సమావేశానిక ఆహ్వానించినట్లు సమాచారం.
Also Read
కాగా.. ప్రియాంకగాంధీతో జరిగిన సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరుకాలేదు. ఆనేపథ్యంలోనే అధిష్టానం పంపించే దూతలతో తాను మాట్లాడేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో.. ఎంపీ కోమటిరెడ్డి మాణిక్కం ఠాగూర్ సమావేశానికి కూడా హాజరవుతారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. అయితే.. మిగిలిన ముగ్గురుతో సమావేశమై అభ్యర్ధి ఎంపిక విషయమై చర్చిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
Bihar: లాలూ ప్రసాద్ యాదవ్ కు షాక్.. ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు
తాజావార్తలు
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
-
CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
-
China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
-
Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
ట్రెండింగ్
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!