భారత్ జోడో యాత్ర పేరటి ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం తెలంగాణ సాగుతోంది. అయితే.. ఈ నేపథ్యంలో నేడు ఆరో రోజు రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతున్న క్రమంలో పాలమాకుల వద్ద జోడో యాత్రలోకి గుర్తు తెలియని వ్యక్తి దూసుకొచ్చారు. భద్రతా వలయాన్ని ఛేదించుకుని లోనికి వ్యక్తి దూసుకువచ్చి.. అతి వేగంతో వెళ్లి రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకున్నాడు సదరు వ్యక్తి. దీంతో.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు.. బలవంతంగా అతన్ని బయటకు తీసుకెళ్లారు. దీంతో.. పోలీసుల వైఖరిపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. పోలీసులు భద్రత వైఫల్యానికి ఇది నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు.
Also Read : Viswa Karthikeya: విడుదలకు సిద్ధమైన ‘అల్లంత దూరాన….’
అయితే.. ఈ నేపత్యంలో తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ..పోలీసులు భద్రత కల్పిస్తారు అని ఆశిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. హైద్రాబాద్ లో పాదయాత్ర నేపథ్యంలో రాహుల్ భద్రతపై సీపీని పార్టీ నాయకులు కలిశారని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా రేపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వస్తున్నారని ఆయన తెలిపారు. రాహుల్ పాదయాత్రకి జనం నుండి మంచి స్పందన వస్తుందని ఆయన తెలిపారు. రాహుల్‌తో కలిసి ప్రజలు అడుగులు వేస్తున్నారని, ప్రజల సమస్యలను సైతం రాహుల్ తెలుసుకుంటున్నారన్నారు. ఎంతో మంది వినతి పత్రాలు సమర్పిస్తున్నారని, వారితో మాట్లాడి వారి సమస్యలను రాహుల్ తెలుసుకుంటున్నారన్నారు.