మునుగోడు ఉప ఎన్నికలపై జూమ్ మీటింగ్ నిర్వహించారు. అయితే.. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎన్నికల ఇంచార్జ్ ఆర్. దామోదర్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, ఎమ్మెల్యే సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, నదీమ్ జావిద్ రోహిత్ చౌడరీ, షబ్బీర్ అలీ, మల్లు రవి, సంపత్ కుమార్, శంకర్ నాయక్, అనిల్ రెడ్డి, చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాణిక్కం మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలు భారత్ జోడో యాత్ర రెండు మనకు చాలా కీలకం. జోడో యాత్ర జాతీయ స్థాయి లో ఎంత కీలకమో, మునుగోడు తెలంగాణ లో అంత ముఖ్యం.. ఇప్పుడు నాయకులు వారి పనితనం చూపించాలి. చిన్న నిర్లక్షం కూడా ఉండకూడదు.. రెండు కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు.
అనంతరం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రచార కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టాలి.. గ్రామాలలో కరపత్రాలు, డోర్ పోస్టర్లు, మరింత వేగంగా పంచి పెట్టాలి. రెండు మూడు రోజులకొకసారి కొత్త కరపత్రాలు పంచాలి. అన్ని వర్గాల ప్రజలను కలిసి ఓట్లు అడగాలి.. ఆయా వర్గాలకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేయాలి.గ్రామాల వారీగా యూనిట్ చేసి ప్రచార కార్యక్రమాలను లోతుగా చేపట్టాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆ తరువాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ క్యాడర్ బాగా పని చేస్తుంది. ఇంత వత్తిడి లో కూడా నిన్న సభను పెద్ద ఎత్తున విజయవంతం చేశారు.. ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను అని ఆయన వ్యాఖ్యానించారు.