కర్ణాటకలోని మంగళూరు శివార్లలోని కాటిప్పళ్లలో శనివారం రాత్రి ఇద్దరు గుర్తుతెలియని దుండగులు 45 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపారు. దీనిని అనుసరించి, జిల్లా యంత్రాంగం డిసెంబర్ 25 ఉదయం 6 నుంచి డిసెంబర్ 27 ఉదయం 6 గంటల వరకు నగర శివార్లలోని సూరత్‌కల్, బజ్పే, కావూరు, పనంబూర్‌లలో సీఆర్‌పీసీ సెక్షన్ 144 విధించింది.
కర్ణాటకలోని మంగళూరులో ఓ ఏఆర్‌ఎస్‌ఐ సినిమా స్టైల్‌లో వెంటాడి దొంగను పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. దొంగ, పోలీసు ఛేజింగ్ సీన్లను సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం.. కానీ, మంగళూరులో ఓ ఏఆర్‌ఎస్‌ఐ సినిమా స్టైల్‌లో వెంటాడి దొంగను పట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. మంగళూరులోని నెహ్రూ మైదాన్ వీధుల్లో మొబైల్ ఫోన్‌ను దొంగిలించిన ఓ దొంగను ఎస్ఐ వెంబడించడం చూసి అంతా నోరువెల్లబెట్టారు.. అసిస్టెంట్ రిజర్వ్ సబ్-ఇన్‌స్పెక్టర్…