Mangaluru: కర్ణాటకలోని మంగళూరు శివార్లలోని కాటిప్పళ్లలో శనివారం రాత్రి ఇద్దరు గుర్తుతెలియని దుండగులు 45 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపారు. దీనిని అనుసరించి, జిల్లా యంత్రాంగం డిసెంబర్ 25 ఉదయం 6 నుంచి డిసెంబర్ 27 ఉదయం 6 గంటల వరకు నగర శివార్లలోని సూరత్‌కల్, బజ్పే, కావూరు, పనంబూర్‌లలో సీఆర్‌పీసీ సెక్షన్ 144 విధించింది. మంగళూరు శివార్లలోని కాటిప్పళ్ల వద్ద గత రాత్రి ఇద్దరు గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపారు. మృతుడు జలీల్‌గా గుర్తించబడ్డాడు. దుకాణం ముందు నిలబడి ఉండగా కత్తితో పొడిచి చంపినట్లు మంగళూరు సీపీ ఎన్.శశికుమార్ తెలిపారు. ఈ ఘటన వెనుక కారణం ఇంకా తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు. హత్య నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరోధించడానికి 144 సెక్షన్ విధించినట్లు సీపీ తెలిపారు. మద్యం అమ్మకాలు కూడా నిషేధించబడ్డాయన్నారు.
Gold Mine Collapse: కుప్పకూలిన బంగారు గని.. చిక్కుకున్న 18 మంది మైనర్లు
బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏజే ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది. హత్య వెనుక గల కారణాలను కనుగొనడానికి తదుపరి దర్యాప్తు పురోగతిలో ఉందని పోలీసులు తెలిపారు. సూరత్కల్ సున్నిత ప్రాంతమని.. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. క్రిస్మన్ పండుగ కావడంతో ఉన్నతాధికారులతో చర్చిస్తున్నామన్నారు.