కర్ణాటకలోని మంగళూరులో ఓ ఏఆర్‌ఎస్‌ఐ సినిమా స్టైల్‌లో వెంటాడి దొంగను పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. దొంగ, పోలీసు ఛేజింగ్ సీన్లను సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం.. కానీ, మంగళూరులో ఓ ఏఆర్‌ఎస్‌ఐ సినిమా స్టైల్‌లో వెంటాడి దొంగను పట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. మంగళూరులోని నెహ్రూ మైదాన్ వీధుల్లో మొబైల్ ఫోన్‌ను దొంగిలించిన ఓ దొంగను ఎస్ఐ వెంబడించడం చూసి అంతా నోరువెల్లబెట్టారు.. అసిస్టెంట్ రిజర్వ్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఏఆర్‌ఎస్‌ఐ)గా విధులు నిర్వహిస్తున్న వరుణ్ అల్వా.. నీర్‌మార్గ్‌కు చెందిన హరీష్ పూజారి అనే దొంగని సినిమా స్టైల్‌లో వెంబడించి పట్టుకున్నాడు. వీడియోలో పోలీసు దొంగని వెంబడిస్తూ ఇరుకైన గల్లీల గుండా వెళ్లడం కనిపించింది, చివరకు దొంగను పట్టుకున్నారు.. దీంతో.. ఏఆర్‌ఎస్‌ఐ వరుణ్ అల్వా అండ్ టీమ్‌కు 10వేల నగదు రివార్డును ప్రకటించారు పోలీసు కమిషనర్. మొత్తంగా సోషల్ మీడియాలో వీడేరా పోలీసు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
Read Also: మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం.. బిల్ గేట్స్‌పై తేల్చేయనుంది..!