అనాధల సంక్షేమం కోసం నిధులు కేటాయించాలి లేక పోతే సీఎం కేసీఆర్, కేటీఆర్ నియోజక వర్గాలలో ధర్నాలు చేస్తామని Mrps రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించాన ఆయన బీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమంపై మండిపడ్డారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న మాట పగటికలలా మిగిలిపోతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం లో ఎస్సీ వర్గీకరణ కోసం చేపట్టిన పాదయాత్రలో భాగంగా మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా మాదిగ జాతి మరో ఉద్యమానికి సిద్ధపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పిన బిజెపి పెద్దలు ఎనిమిది సంవత్సరాలు అయినా…
మాదిగలకు అన్యాయం చేసే పార్టీలకు తగిన బుద్ధి చెబుతామన్నారు మందకృష్ణ మాదిగ. మాదిగల సంగ్రామ పాదయాత్రను ప్రారంభించిన మందా కృష్ణమాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడ వరకూ 88 నియోజకవర్గాల గుండా పాదయాత్ర సాగనుంది. పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణకు ముందుకు రానిపక్షంలో ఎందుకు పార్టీ తీర్మానాలు చేసారో బీజేపీ పెద్దలు సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ పాలకులకు చిత్త శుద్ధి లేదు. మాదిగలను మరో ఉద్యమానికి సిద్దం చేసేందుకు , కేంద్రంపై ఒత్తిడి…
విజయవాడలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ అంశం ఇంకా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లోనే ఉందని.. దీనిపై చంద్రబాబు చొరవ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్యను మందకృష్ణ కోరారు. మహానాడులో ఎస్సీ వర్గీకరణ అంశం పరిష్కారానికి టీడీపీ తీర్మానం చేసేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణ పట్ల వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉందని మందకృష్ణ ఆరోపించారు. Andhra Pradesh:…
Manda Krishna Madiga Made Comments On CM KCR. రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ మాటలు అర్ధరహితమని మందకృష్ణ మాదిగ అన్నారు. బుధవారం ఆయన మెదక్‌లోని టీఎన్జీవో భవన్‌లో రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేయడానికే సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటున్నడని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి కేసీఆర్ వ్యతిరేకమని ఆయన విమర్శించారు. పాలకులను ప్రశ్నించే స్వేచ్ఛను ప్రజలు కోల్పోయే ప్రమాదం ఉందని, సీఎం కేసీఆర్ రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకి…
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు స్వల్ప గాయాలయ్యాయి… ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న మంద కృష్ణ… ఓ ప్రైవేట్ హోటల్‌లో దిగారు.. అయితే, హోటల్ గదిలోని బాత్‌రూమ్‌లో జారిపడ్డ మందకృష్ణ మాదిగకు స్వల్ప గాయాలు అయినట్టు చెబుతున్నారు.. దీంతో, ఆయనను వెంటనే ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు ఆయన అనుచరులు… ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మాత్రం తెలియాల్సి ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో దళితుడే ముఖ్యమంత్రి అని నమ్మించి మోసం చేసిన సీఎం కేసీఆరే దళితుల ప్రధాన శతృవు అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఏడేండ్లపాలనలో దళితులకు అన్యాయమే జరిగింది, ఏనాడూ దళితబంధు కాలేదు.. కేసీఆర్ రాబందులా కనిపిస్తున్నాడు అంటూ మందకృష్ణ విమర్శలు చేశారు. కేసీఆర్ అవసరమైన సమయంలో ఎదో నిర్ణయం తీసుకుంటాడు ఆతర్వాత పక్కకు పడేస్తాడు. హుజూరాబాద్ లో మెజార్టీ ఓట్లు దళితుల ఉన్నాయి కాబట్టే పైలట్ ప్రాజెక్టుగా దళితబంధు తీసుకొచ్చాడు,…