ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు స్వల్ప గాయాలయ్యాయి… ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న మంద కృష్ణ… ఓ ప్రైవేట్ హోటల్‌లో దిగారు.. అయితే, హోటల్ గదిలోని బాత్‌రూమ్‌లో జారిపడ్డ మందకృష్ణ మాదిగకు స్వల్ప గాయాలు అయినట్టు చెబుతున్నారు.. దీంతో, ఆయనను వెంటనే ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు ఆయన అనుచరులు… ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మాత్రం తెలియాల్సి ఉంది.