Manda Krishna Madiga: బిల్లు పెట్టకపోతే మా సత్తా చూపిస్తాం.. మందకృష్ణ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manda Krishna Madiga Warns Central Govt Over SC Bill: పార్లమెంటులో ఎస్సీ బిల్లు పెట్టకపోతే.. తమ సత్తా చూపిస్తామని ఎమ్‌ఆర్‌పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ప్రకాశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా పదే పదే హామీలు ఇవ్వటం కన్నా, పార్లమెంటులో బిల్లును పెట్టాలని ప్రధాని మోడీని కోరుతున్నామన్నారు. పార్లమెంటులో సంపూర్ణ మద్దతు ఉన్నా.. బీజేపీ కేవలం మాటలకే పరిమితం అయ్యిందన్నారు. 2013లోనే బీజేపీ అధికారంలోకి వస్తే.. ఎస్సీ వర్గీకరణకు మద్దతునిస్తామని మోడీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అన్నీ రాజకీయ పార్టీలు కూడా లేఖలు ఇచ్చాయన్నారు. వచ్చే పార్లమెంటు సమయంలో తనని కలవాలని మోడీ కబురు చేయించారన్నారు. దళితుల మీద దేశవ్యాప్తంగా దాడులు పెరుగుతున్న మాట వాస్తవమేనని అన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు గతంలో అధికారంలో ఉన్నప్పుడు జరిగిన దాడులు కనిపించలేదని దుయ్యబట్టారు.
Tana President: వాషింగ్టన్ డీసిలో అంబరాన్నంటిన కొడాలి నరేన్ ఆత్మీయుల కోలాహలం
Also Read
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
- Punganur Clashes: పుంగనూరు ఘటనపై మూడు కేసులు నమోదు.. డీఐజీ కీలక వ్యాఖ్యలు
- MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
అంతకుముందు.. వరంగల్‌లో ప్రధాని మోడీ పర్యటించిన సందర్భలో మందకృష్ణ మాదిగ కలవడం జరిగింది. ఈ సందర్భంగా మందకృష్ణను మోడీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ గురించి మోడీ వద్ద మందకృష్ణ ప్రస్తావించినట్టుగా తెలిసింది. ప్రధాని మోడీ తనకోసం ప్రత్యేక సమయం తీసుకొని కలిశారని సంతోషం వ్యక్తం చేశారు. మోడీ తనను ఎంతో ప్రేమతో హత్తుకొని ఆత్మీయంగా పలకరించారని.. ఈ భేటీలో ఆయన వద్ద ఎస్సీ వర్గీకరణ చట్టబద్దత అంశం మీద చర్చించడం జరిగిందని పేర్కొన్నారు. అయితే.. ఈ భేటీ అయిన రెండు రోజుల తర్వాత మోడీపై మందకృష్ణ విరుచుకుపడ్డారు. సామాన్య కార్యకర్త నుండి ప్రధాని మోడీ వరకు వర్గీకరణకు అనుకూలమని చెబుతూనే.. మాదిగలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వర్గీకరణ పట్ల హామీ ఇస్తూనే, పార్లమెంట్‌లో ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ప్రశ్నించారు. ఇలాగే కాలయాపన చేస్తే.. బీజేపీపై నమ్మకం పెట్టుకున్న మాదిగలు విశ్వసించబోరని అసహనం వ్యక్తం చేశారు.
Delhi Rains: ఢిల్లీలో మరో రెండు రోజులు పాఠశాలలకు సెలవు.. వరద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
తాజావార్తలు
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!