Kolkata Murder Case : ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసు తదుపరి విచారణ నేడు సుప్రీంకోర్టులో కొనసాగుతోంది.
Trinamool Congress: మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ ఆదివారం తన పార్లమెంటరీ పదవికి రాజీనామా చేశారు. కొల్కతా ఆస్పత్రిలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనలో బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఆయన రాజీనామా చేశారు.
West Bengal BJP: ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచార, హత్య ఘటనకు ప్రధాన కారణం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీయేనని బెంగాల్ అసెంబ్లీలో విపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపణలు చేశారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్, ఫరక్కాబాద్ లాంటి ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి.. మహిళలపై నేరాల విషయంలో యూపీ ముందువరసలో ఉందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు సరిగ్గా పని చేయకపోవడంతో మహిళలపై వేధింపులు భారీగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Bengal Assembly: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన తీవ్ర ప్రకంపనలు రేపుతుంది. దీంతో పెద్ద ఎత్తున విమర్శల రావడంతో.. అసెంబ్లీలో ఇవాళ (మంగళవారం) బెంగాల్ సర్కార్ హత్యాచార నిరోధక బిల్లును తీసుకొచ్చింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో అత్యాచార నిరోధక బిల్లు ఆమోదం పొందింది. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన తర్వాత మమతా ప్రభుత్వం అత్యాచార నిరోధక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
ఇదిలా ఉంటే, వరసగా ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు ‘‘అత్యాచార నిరోధక బిల్లు’’ని మమతా సర్కార్ ఈ రోజు బెంగాల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అపరాజిత స్త్రీ మరియు పిల్లల బిల్లు (పశ్చిమ బెంగాల్ క్రిమినల్ చట్టాలు మరియు సవరణ) బిల్లు, 2024కి ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇవ్వడంతో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అత్యాచార దోషుల చర్యలు బాధితురాలి మరణానికి దారి తీస్తే మరణశిక్ష విధించేలా ఈ కొత్త బిల్లు రూపొందించబడింది.
Abhishek Banerjee: కోల్‌కతాలో వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా హత్యాచారం జరిగింది. ఈ కేసుని సరిగా డీల్ చేయడంలో బెంగాల్ ప్రభుత్వం, పోలీసులు విఫలమైనట్లు కలకత్తా హైకోర్టు చీవాట్లు పెట్టింది. కేసుని సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా అరెస్ట్ చేశారు.
TMC Leader: కోల్‌కతా డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన పశ్చిమ బెంగాల్‌తో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిపై ఆర్ జీ మెడికల్ కాలేజ్ సెమినార్ హాలులో ఈ ఘటన జరిగింది. నిందితుడైన సంజయ్ రాయ్‌పై చర్యలు తీసుకోవాలని వైద్యులతో సహా సాధారణ ప్రజలు దేశవ్యాప్తంగా నిరసనలు చేశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీకి మరో లేఖ రాశారు. ఈ సందర్భంగా మమత.. కఠినమైన కేంద్ర చట్టం, అత్యాచారం, హత్య వంటి క్రూరమైన నేరాలను పాల్పడి నిందితులను శిక్షించాలని.. నిర్ణీత గడువులోపు కేసులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.