రైతులు పండించిన పంట కొనుగోళ్ల విషయంలో తెలంగాణ సర్కార్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వంగా మారింది పరిస్థితి… రాష్ట్ర బీజేపీ నేతలు టీఆర్ఎస్ సర్కార్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్న ఆ పార్టీ నేతలు.. కేంద్రం చెప్పేది ఒకటైతే.. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం మరో మార్గం ద్వారా రైతులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు.. ఇక కేంద్రంపై యుద్ధం ప్రకటించి మహాధర్నాకు దిగారు గులాబీ పార్టీ దళపతి కేసీఆర్.. అయితే.. ఈ ధర్నాపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది… కేసీఆర్ చేయాల్సింది ధర్నా కాదు.. సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క..
Read Also: బీఏసీలో ఆసక్తికర చర్చ.. చంద్రబాబు మొహం చూడాలని ఉంది..
ధాన్యం కొనలేని ప్రభుత్వాలు ఉండి ఏం లాభం లేదని మండిపడ్డారు.. రాజీనామా చేస్తే… రైతులకు ఏ ప్రభుత్వం కావాలో వాళ్తు తెచ్చుకుంటారని సలహా ఇచ్చారు భట్టి. ఇక, టీఆర్ఎస్ మహా ధర్నాపై సెటైర్లు వేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి… సీఎం కేసీఆర్ ధర్నా.. ధర్నా లెక్క లేదు.. అది టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం లెక్క ఉందంటూ ఎద్దేవా చేశారు.. ఫైవ్ స్టార్ హోటల్‌లో మీటింగ్ లెక్క ధర్నాలో కూర్చున్నారని ఎద్దేవా చేశారు జీవన్‌రెడ్డి.. రెండు గంటలు ధర్నా… ఆయన చిత్తశుద్ధి రైతుల మీద ఎంతో అర్థం చేసుకోవచ్చు అని కామెంట్ చేశారు. కాగా, టీఆర్ఎస్‌కు పోటీకి ఆందోళనకు సిద్ధం అవుతోంది బీజేపీ పార్టీ…