CM Yogi: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం వాడీవేడిగా కొనసాగుతోంది. ముఖ్యంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. మంగళవారం సీఎం యోగి మాట్లాడుతూ.. ఖర్గే చిన్నతనం నాటి ఘటనను గుర్తు చేశారు. సాధువులు, కాషాయం ధరించిన వారు రాజకీయం చేయొద్దని ఖర్గే చేసిన వ్యాఖ్యలు ధీటుగా బదులిచ్చారు.
Jagadguru: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాషాయం ధరించి సాధువులమని చెప్పుకునే వ్యక్తులు రాజకీయాలను వదిలిపెట్టాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఆధ్యాత్మిక నాయకుడు జగద్గురు రాంభద్రాచార్య మండిపడ్డారు. ఖర్గే వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. దేవుడి రంగు కాషాయమని, కాషాయ రంగులో ఉన్నవారు రాజకీయాల్లోకి రావాలని వాదించారు. ‘‘రాజకీయాల్లో గుండాలు ఉండాలా..? లోఫర్లు రాజకీయాలు చేయాలా..? భగవధారి రాజకీయాలు చేయాలి. కాషాయం ధరించిన వారు రాజకీయాల్లోకి రావద్దని ఎక్కడ…
Kharge : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీ పథకాలను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఐదు రకాల సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు విశ్వాసం వ్యక్తం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీని గురించి గర్వంగా భావించి, దేశంలోని పురాతన పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే మహారాష్ట్ర ఓటర్లకు ఐదు హామీలను ఇచ్చింది. అయితే, కర్ణాటకలో 5 హామీల పథకం కాంగ్రెస్‌కు ఖర్చుతో…
BJP: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుధవారం వయనాడ్ లోక్‌సభ స్థానానికి ప్రియాంకాగాంధీ నామినేషన్ వేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అట్టహాసంగా నిర్వహించింది. నామినేషన్ వేస్తున్న సమయంలో మల్లికార్జున ఖర్గేని అనుమతించలేదని, గేటు వద్దే ఉంచారని చూపిస్తున్న వీడియో వైరల్‌పై బీజేపీ స్పందించింది.
కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. ఎల్లుండి (బుధవారం) ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో.. వయనాడ్‌లో పెద్ద ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ ర్యాలీలో ప్రియాంక గాంధీతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొననున్నారు.
BJP: ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్‌ని ఉద్దేశిస్తూ ఇటీవల కాంగ్రెస్‌ని ‘‘అర్బన్ నక్సల్స్’’ నడిపిస్తున్నారంటూ విమర్శించారు. ప్రధాని మోడీని వ్యాఖ్యల్ని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారు. బీజేపీ ‘‘టెర్రరిస్టుల పార్టీ’’గా విమర్శించారు. దీంతో ఇరు పార్టీల మధ్య వివాదం మొదలైంది. బీజేపీ ప్రజల్ని కొట్టి చంపడం, గిరిజనులు-దళితులపై దౌర్జన్యాలకు పాల్పడుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నారు.
ఇరాన్లో భారీ స్థాయిలో సైబర్ దాడులు.. అణుస్థావరాలే లక్ష్యంగా.. పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణంతో ప్రపంచమంతా తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఈ సమయంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇరాన్లో ఈరోజు (శనివారం) భారీ స్థాయిలో సైబర్ దాడులు జరిగినట్లు తేలింది. దాంతో సర్కార్ లోని మూడు బ్రాంచ్‌ల (న్యాయ, శాసన, కార్యనిర్వాహక శాఖలు) సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే, అణుస్థావరాలే టార్గెట్ గా ఈ దాడులు జరిగాయి. దీని వల్ల సమాచారం చోరీకి గురైందని…