ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే లేఖ రాశారు. ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని లేఖలో ఖర్గే కోరారు. క్రమశిక్షణ లేని నాయకులను నియంత్రించాలని కోరుతున్నానని.. భారతీయ రాజకీయాలు పతనం కాకుండా ఉండాలంటే తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బీజేపీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంత్‌నాగ్‌లో ఖర్గే పర్యటించారు. ఈ సందర్భంగా కమలం పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల్లో తమకు మరో 20 సీట్లు వచ్చుంటే వారంతా జైల్లో ఉండేవారని వ్యాఖ్యానించారు.
AICC: ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జ్ను ఖర్గే, రాహూల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ రోజు (మంగళవారం) న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో పార్టీ నూతన కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులతో భేటీ అయ్యారు.
Mallikarjun Kharge: కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్, ఆ పార్టీకి చెందిన కీలక నేతలు వరసగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్ర రాజకీయాలను ‘‘ముడా’’ స్కామ్ సంచలనంగా మారింది. ఇందులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య ప్రమేయం ఉండటంతో బీజేపీతో పాటు జేడీఎస్ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సీఎంపై విచారణకు కర్నాటక గవర్నర్ ఆదేశాలు ఇవ్వడంతో, ఆ తర్వాత హైకోర్టు దీనిపై స్టే విధించడం జరిగింది.
Rahul Gandhi : జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించారు. కేంద్రపాలిత ప్రాంతంలో రాజకీయ వేడి కూడా రోజురోజుకు పెరుగుతోంది. కాగా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం శ్రీనగర్ చేరుకున్నారు.
Jammu Kashmir Assembly Polls: నేటి నుంచి రెండ్రోజుల పాటు జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. జమ్మూ, శ్రీనగర్‌లోని పార్టీ కీలక నేతలతో పాటు పార్టీ శ్రేణులతో వారు సమావేశం కానున్నారు.
KTR: తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ పేరుతో చేసిన మోసంపైన రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు.
మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి సాల్సెంగ్.సి.మారక్(82) శుక్రవారం వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 82 ఏళ్ల వయస్సు గల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తురా సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
AICC Meeting Today in Delhi: నేడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరుగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ఆరంభం కానుంది. తెలంగాణతో సహా 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులు ఎవరు, ఏఐసీసీ ప్రక్షాళన, పార్టీ బలోపేతానికి ఏం చేయాలి, వచ్చే ఎన్నికల్లో అధికారం ఎలా దక్కించుకోవాలి.. ఇవే అంశాలు ప్రధాన ఎజెండాగా నేడు కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహిస్తోంది.…