తాజాగా మణిపూర్‌లో చెలరేగిన హింసపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. మీ డబుల్ ఇంజన్ ప్రభుత్వ హయాంలో మణిపూర్ భద్రంగా లేదని ఆయన అన్నారు. మే 2023 నుంచి పెరుగుతున్న హింస మణిపూర్ ప్రజల భవిష్యత్తును పాడు చేసిందని అభిప్రాయపడ్డారు. బీజేపీ జుగుప్సాకరమైన విభజన రాజకీయాలు చేస్తున్నందోని విమర్శించారు. మణిపూర్‌లో ఉద్దేశపూర్వకంగా విద్వేషాలు రెచ్చగొడుతోందని కాల్చివేయాలని భావిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.
READ MORE: Lipstick: లిప్‌స్టిక్ రాస్తున్నారా? ఈ విషయం తెలిస్తే అస్సలు టచ్ చేయరు..
కాగా.. మణిపూర్ రాష్ట్రంలో మళ్లీ హింస చెలరేగుతుంది. కుకీ వర్గానికి చెందిన మిలిటెంట్లు మైటీ వర్గానికి చెందిన ఓ ఫ్యామిలినీ కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేయడంతో మరోసారి రాష్ట్రంలో ఉద్రిక్తత ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో హత్య చేసిన వారిని 24 గంట్లలో అరెస్ట్ చేసి శిక్షించాలని మైటీ సామాజిక వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కుకీ వర్గానికి చెందిన మిలిటెంట్లు జిరిబం జిల్లాలో ఆరుగురిని దారుణం చంపేసి ఓ నది దగ్గర పడేశారు. వీరిలో మహిళలు ముగ్గురు ఉండగా మరో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతుల్లో 10 నెలల చిన్నారి ఉండటం తీవ్ర కలకలం రేపుతుంది.
READ MORE:Manipur violence: మణిపూర్ సర్కార్కు మైటీల డెడ్లైన్.. వారిని 24 గంట్లలో శిక్షించాలని డిమాండ్
ఈ ఘటన స్థానికులని తీవ్రంగా కలచివేసింది. దీంతో, ఇంపాల్‌లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఇంఫాల్ వెస్ట్‌లో సగోల్ బంద్‌లో ఉంటోన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆర్కే ఇమో నివాసం ముందు నిరసనకారులు ఆందోళనకు దిగారు. రోడ్లపై ఫర్నీచర్లను కాల్చివేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక, పలు జిల్లాలో నిరసనలు పెరగడంతో అధికారులు రెండు రోజులు పాటు 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను బంద్ చేసి కర్ఫ్యూ విధించారు.