Congress: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్ను అవమానించినందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖర్ వ్యవహారశైలి కారణంగానే సభలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. ఇండియా కూటమి నేతలతో కలిసి ఖర్గే మీడియాతో మాట్లాడారు.
Congress: లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ మార్క్ చేరనీయ్యలేదని, తమకు ప్రతిపక్ష హోదా దక్కిందనే సంతోషం కాంగ్రెస్ పార్టీకి ఎంతో కాలం నిలవలేదు. వరసగా హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోర పరాజయాలను చవిచూసింది. జార్ఖండ్లో ఇండియా కూటమి గెలిచినప్పటికీ, క్రెడిట్ అంతా జార్ఖండ్ ముక్తీ మోర్చా(జేఎంఎం) , సీఎం హేమంత్ సొరెన్కే దక్కింది. జార్ఖండ్లో ప్రాంతీయ పార్టీకి చిన్న భాగస్వామిగా కాంగ్రెస్ మిగిలింది.
Mallikarjun Kharge: హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్(ఈవీఎం)లపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మంగళవారం మాట్లాడుతూ.. ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్ని ఉపయోగించాలని సూచించారు.
జేపీ నడ్డా రాసిన లేఖలో.. భారత భద్రతా వైఫల్యానికి.. దేశంలోకి విదేశీ ఉగ్రవాదుల అక్రమ వలసలకు కాంగ్రెస్ కారణమని పేర్కొన్నారు. మణిపూర్లో పరిస్థితిని మరింత వివాదంగా సృష్టించేందుకు మీ (కాంగ్రెస్) పార్టీ పదే పదే ఎలా ప్రయత్నిస్తుందో అందరు తెలుసని చెప్పుకొచ్చారు.
తాజాగా మణిపూర్లో చెలరేగిన హింసపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. మీ డబుల్ ఇంజన్ ప్రభుత్వ హయాంలో మణిపూర్ భద్రంగా లేదని ఆయన అన్నారు. మే 2023 నుంచి పెరుగుతున్న హింస మణిపూర్ ప్రజల భవిష్యత్తును పాడు చేసిందని అభిప్రాయపడ్డారు. బీజేపీ జుగుప్సాకరమైన విభజన రాజకీయాలు చేస్తున్నందోని విమర్శించారు. మణిపూర్లో ఉద్దేశపూర్వకంగా విద్వేషాలు రెచ్చగొడుతోందని కాల్చివేయాలని భావిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.
Priyank Kharge: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవల కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే గతాన్ని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాం హయాంలో అప్పటి హైదరాబాద్ ప్రాంతంలోని ఖర్గే గ్రామంపై రజాకార్లు దాడి చేసి, ఖర్గే ఇంటిని కాల్చిన సంగతిని గుర్తు చేశారు. ఈ ఘటనలో ఖర్గే తల్లితో పాటు ఆయన కుటుంబం కూడా మరణించారు. ఈ విషయాన్ని యోగి ఆదిత్యనాథ్ చెబుతూ.. తన కుటుంబ త్యాగాన్ని మరిచి ఖర్గే ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాడని…
CM Yogi: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం వాడీవేడిగా కొనసాగుతోంది. ముఖ్యంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. మంగళవారం సీఎం యోగి మాట్లాడుతూ.. ఖర్గే చిన్నతనం నాటి ఘటనను గుర్తు చేశారు. సాధువులు, కాషాయం ధరించిన వారు రాజకీయం చేయొద్దని ఖర్గే చేసిన వ్యాఖ్యలు ధీటుగా బదులిచ్చారు.
Jagadguru: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాషాయం ధరించి సాధువులమని చెప్పుకునే వ్యక్తులు రాజకీయాలను వదిలిపెట్టాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఆధ్యాత్మిక నాయకుడు జగద్గురు రాంభద్రాచార్య మండిపడ్డారు. ఖర్గే వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. దేవుడి రంగు కాషాయమని, కాషాయ రంగులో ఉన్నవారు రాజకీయాల్లోకి రావాలని వాదించారు. ‘‘రాజకీయాల్లో గుండాలు ఉండాలా..? లోఫర్లు రాజకీయాలు చేయాలా..? భగవధారి రాజకీయాలు చేయాలి. కాషాయం ధరించిన వారు రాజకీయాల్లోకి రావద్దని ఎక్కడ…