హర్యానా ఎన్నికల ఫలితాలను అంగీకరించబోమని కాంగ్రెస్ ప్రకటించింది. ఫలితాలను తారుమారు చేశారంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీనియర్ నేత జైరాం రమేష్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేస్తామని వ్యాఖ్యానించారు.
ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఇవాళ కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ అధికారం నుంచి దించే వరకు తాను చనిపోనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన ప్రకటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్లో జరిగిన ప్రచార ర్యాలీలో అస్వస్థతకు గురై తన ప్రసంగాన్ని కొనసాగించిన సందర్భంగా ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోగ్యం క్షీణించింది. కథువాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించేందుకు ఆయన వచ్చారు.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోగ్యం క్షీణించింది. కథువాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించేందుకు ఆయన వచ్చారు.
కాంగ్రెస్ నేతలు చిక్కుల్లో పడుతున్నారు. మొదట కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే న్యాయపరమైన సమస్యలతో సతమతం అవుతున్నారు. మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఆయన కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ నేత ఎన్ఆర్ రమేష్ కర్ణాటక లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు.
Mallikarjun Kharge: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలకు కారణమవుతున్నాయి. కాంగ్రెస్-ఎన్సీ పొత్తుపై బీజేపీ చేసిన విమర్శలకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జన ఖర్గే ప్రతిస్పందించారు. శనివారం ప్రధాని నరేంద్ర మోడీ ,హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రధాని మోడీ, అమిత్ షాలు ఇటీవల మాట్లాడుతూ.. కాంగ్రెస్-ఎన్సీ కూటమి పాకిస్తాన్ ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుందని ఆరోపించారు.
JP Nadda: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంగా కాంగ్రెస్- బీజేపీల మధ్య వివాదం ముదురుతుంది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా రాసిన లేఖలో మోడీని విమర్శిస్తే మల్లికార్జున ఖర్గే ఎందుకు మాట్లాడ్డం లేదు అని ప్రశ్నించారు.
వన్ నేషన్, వన్ ఎలక్షన్స్ ఆచరణ సాధ్యం కాదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. కేంద్రం ఈ ప్రతిపాదనను ప్రజలెవరూ అంగీకరించని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అసలు సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ ఇలా చేస్తుందని ఖర్గే ఆరోపించారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు.