Mallikarjun Kharge: ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కలబురిగిలో జరిగిన ఓ సభలో పాల్గొన్న ఖర్గే.. ప్రధాని మోదీ ‘‘విషపు పాము’’అని, ఇది నిజమా కాదా..? అని తేలుసుకోవాలంటే ఒక్కసారి ముట్టుకోవాలని,
దేశంలో 2021 జనాభా లెక్కలను త్వరగా నిర్వహించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రధానిని డిమాండ్ చేశారు. జనాభా గణనలో కులాన్ని అంతర్భాగంగా చేయాలని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
కాంగ్రెస్ తీసుకొచ్చిన సంస్కరణల వల్లే నేడు మోడీ ప్రధాని అయ్యారని, అమిత్ షాకు హోంమంత్రి అయ్యే అవకాశం వచ్చిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు అన్నారు. శుక్రవారం రాత్రి తెలంగాణలోని మంచిర్యాలలో జరిగిన 'జై భారత్ సత్యాగ్రహ సభలో' ఖర్గే ప్రసంగించారు.
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలోని విపక్ష పార్టీలు ఏకం అవుతున్నాయి. ఈ క్రమంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కలిసిన సంగతి తెలిసిందే.
రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు తలనొప్పిగా మారింది. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.
Nitish Kumar Meets Rahul Gandhi: జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తున్న బీహార్ సీఎం నితీష్ కుమార్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. సమావేశంలో ఆర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా పాల్గొన్నారు. బుధవారం ఢిల్లీలో ఈ భేటీ జరిగింది. సమావేశం జరిగే సమయంలో జేడీయూ అధ్యక్షుడు లాలన్ సింగ్ కూడా ఉన్నారు. ఢిల్లీలో ఆర్జేడీ…
అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై దృష్టి మళ్లించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలపై నడుచుకోవడం లేదని, పార్లమెంటులో అంతరాయాలకు కారణమైందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.
బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని విపక్షాలు ఏకం అవుతున్నాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం, దేశంలో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కడంపై బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారం కూడా తమ ‘నల్ల’ నిరసనను కొనసాగించాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయి.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన తర్వాత దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఓవైపు కేంద్రాన్ని టార్గెట్ చేస్తూనే మరోవైపు రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తున్నారు. విపక్షాలు ఏకం అవుతున్నట్లు తెలుస్తోంది.
లోక్‌సభ ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని, రాహుల్ కోసం పోరాటం చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు.