APCC Chief Gidugu Rudraraju Comments After Meeting With Mallikarjun Kharge: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రానుందని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు హెచ్చరించారు. ఏపీ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉన్నారని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను ఖర్గేతో ఏపీ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలపై చర్చించానని అన్నారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. తాను చేపట్టిన పలు ప్రజా కార్యక్రమాల వివరాలను ఖర్గేకు అందజేశానని చెప్పారు. ఖర్గేను ఏపికి రావాలని ఆహ్వానించానన్నారు. విశాఖపట్నం, రాయలసీమలో త్వరలోనే భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సభలకు ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించామని పేర్కొన్నారు. విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన సమావేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు.
Actor Yash: ఎట్టకేలకు ఆ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యశ్..?
జగన్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు కురిపించడం ఆశ్చర్యంగా ఉందని గిడుగు రుద్రరాజు చెప్పారు. ఇన్నాళ్లూ అన్ని రకాలుగా అధికార వైసీపీ మద్దతు తీసుకొని.. ఇప్పుడు హఠాత్తుగా విమర్శలు చేయడం షాక్‌కి గురి చేసిందన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని వీడిపోయిన ఓటర్లందరూ.. తిరిగి వస్తారని విశ్వాసం తమకుందన్నారు. రెండు ప్రాంతీయ పార్టీల (టీడీపీ, వైసీపీ పార్టీలను ఉద్దేశించి) పాలన చూసిన ప్రజలు.. ఇప్పుడు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. ఏపీలో క్షేత్రస్థాయిలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేలా ఏపీ ప్రజలు మద్దతివ్వాలని అభ్యర్థించారు. కర్నాటక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత.. దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో త్వరలో రాబోయే ఎన్నికల్లో.. తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని గిడుగు రుద్రరాజు ధీమా వ్యక్తం చేశారు.
Green Card: ఇండియన్స్‌కి అమెరికా గుడ్ న్యూస్.. గ్రీన్ కార్డ్ నిబంధనల సరళీకరణ