Telangana Congress: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆదివారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. ఈ నెల 26న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.
ఎర్రకోటలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన మల్లికార్జన ఖర్గే గౌర్హాజరయ్యారు.
Mallikarjun Kharge: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ నెల 18న తెలంగాణలో పర్యటించనున్నారు. పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన తర్వాత ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో ఆయన పర్యటించనున్నారు.
Opposition Meeting: గత నెలలో పాట్నా వేదికగా బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో విపక్షాల భేటీ జరిగింది. ముందుగా సిమ్లా వేదిక రెండోసారి ప్రతిపక్షాలు భేటీ కావాలని అనుకున్నాయి. అయితే ఈ వేదికను బెంగళూర్ కి మార్చారు. ఈ నెల 17-18 తేదీల్లో బెంగళూర్ వేదికగా రెండోసారి విపక్షాల భేటీ జరగబోతోంది.
పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సలహా మేరకే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్తో పొత్తు పెట్టుకున్నట్లు కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ శనివారం స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సమష్టి నాయకత్వమే ఏకైక మార్గమని అన్నారు.
ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రిగా టీఎస్ సింగ్ డియోను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే బుధవారం నియమించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో త్వరలో జరగనున్న ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించేందుకు జరిగిన సమీక్షా సమావేశంలో సింగ్ డియో నియామకాన్ని ప్రకటించారు.
శుక్రవారం బీహార్లోని పాట్నాలో నాలుగు గంటలపాటు జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి 16 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 32 మంది నాయకులు హాజరయ్యారు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల్లో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని ఈ సమా నిర్ణయించుకున్నారు.
ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో కాగ్ నివేదికలను ప్రభుత్వం ఎందుకు విస్మరించిందని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జను ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.