Punjab Court: రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో మల్లికార్జున్ ఖర్గేకు పంజాబ్ కోర్టు సమన్లు జారీ చేసింది. జులై 10న కోర్టు ముందు హాజరు కావాలని సంగ్రూర్ జిల్లా కోర్టు ఖర్గేకు సమన్లు పంపింది. కాగా ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ విశ్వహిందూ పరిషత్ యువజన విభాగమైన బజరంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బజరంగ్ దళ్ అని పేరు పెట్టి, కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో మెజారిటీ లేదా మైనారిటీ వర్గాల మధ్య శత్రుత్వం లేదా ద్వేషాన్ని ప్రోత్సహించే సంస్థలను నిషేధిస్తామని హామీ ఇచ్చింది.
నిషేధిత ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)తో సంఘ్ అనుబంధ విశ్వహిందూ పరిషత్ యువజన విభాగమైన బజరంగ్ దళ్‌ను పోల్చినందుకు “బజరంగ్ దళ్ హిందుస్థాన్” సంస్థ అధ్యక్షుడు హితేష్ భరద్వాజ్ పరువునష్టం కేసు వేశారు. ఈ పరువునష్టం కేసులో పంజాబ్ కోర్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకి సమన్లు జారీ చేసింది. ఇటీవల ముగిసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో బజరంగ్ దళ్‌ను సిమి, అల్-ఖైదా వంటి దేశ వ్యతిరేక సంస్థలతో పోల్చిందని పిటిషనర్ తెలిపారు. దీనిపై సీనియర్ డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. మల్లికార్జున ఖర్గేను జులై 10న కోర్టుకు హాజరు కావాలని సివిల్ జడ్జి రమణదీప్ కౌర్ ఏఐసీసీ అధ్యక్షుడికి సమన్లు జారీ చేసింది. కాగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో భజరంగ్ దళ్‌ను దేశ వ్యతిరేక సంస్థలతో పోల్చిందని హితేష్ భరద్వాజ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కర్ణాటకలో తాము అధికారంలోకి వస్తే ఆ సంస్థను నిషేధిస్తామని కూడా హామీ ఇచ్చిందని తెలిపారు.
Read Also: Sons Body in Bag: అంబులెన్స్‌కు డబ్బుల్లేక.. బిడ్డ మృతదేహాన్ని బ్యాగులో దాచి బస్సులో..
మల్లేశ్వరం నియోజక వర్గంలో తన స్థానాన్ని నిలబెట్టుకున్న కర్ణాటక మంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ్, ఫలితాల రోజున తరచుగా భజరంగ్ దళ్‌ను నిషేధించాలని కాంగ్రెస్‌కు సవాలు విసిరారు.”బజరంగ్‌దళ్‌పై నిషేధం విధించడంపై వారికి ఎంత ధైర్యం.. వాళ్లను ప్రయత్నించనివ్వండి.. మేం ఏం చేయగలమో చూపిస్తాం’ అని ఆయన అన్నారు.