Congress: కాంగ్రెస్ పార్టీ నేడు అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లతో పాటు కీలక నేతలకు సమాచారం ఇచ్చారు. సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సమావేశం జరుగబోతోంది.
Mallikarjun Kharge: ‘జాతీయ వ్యతిరేక టూల్ కిట్’లో రాహుల్ గాంధీది శాశ్వత భాగస్వామ్యం అంటూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే విరుచుకుపడ్డారు. బీజేపీనే దేశ వ్యతిరేకుల పార్టీ అని, వారు భారతస్వాతంత్య్ర ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనలేదని ఆయన అన్నారు. బ్రిటిష్ వారి కోసం పని చేశారని దుయ్యబట్టారు. ఇంత చేసినవారు ఇతరులను దేశ వ్యతిరేకులుగా పిలుస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
Congress: కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే బీజేపీపై వంగ్యాస్త్రాలు సంధించారు. నిన్న ట్రిపుల్ ఆర్ సినిమాలోని ‘‘ నాటు నాటు’’ పాటకు ‘‘ ది ఎలిఫెంట్ విస్పరర్స్’’ డాక్యుమెంటరీలకు ఆస్కార్ అవార్డులు రావడాన్ని ప్రస్తావిస్తూ పార్లమెంట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. మేము చాలా గర్వంగా ఉన్నాము.. అయితే నా ఏకైక అభ్యర్థన ఏంటంటే బీజేపీ ఈ అవార్డులు తన ఘనత అని చెప్పుకోవద్దని ఖర్గే అన్నారు.
రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరిగాయి. టి నుంచి ప్రారంభం కానున్న రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ ఆమోదం, గ్రాంట్లపై చర్చ చేపట్టనున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత్‌లో ప్రజాస్వామ్యం, పార్లమెంట్ పనితీరుపై బ్రిటన్ ఎంపీలు ఆయనను ప్రశ్నించారు. వీటికి సమాధానంగా భారత్‌లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని రాహుల్ గాంధీ వెల్లడించారు.
Farooq Abdullah comments on Mallikarjun Kharge: ముందుగా ఎన్నికల్లో గెలుద్ధాం, ఆ తరువాత ప్రధాని ఎవరు అవుతారో చూద్దాం అని కాశ్మీర్ నేత, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్డుల్లా అన్నారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 70వ జన్మదిన వేడుకల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. ఫరూక్ అబ్దుల్లా, మల్లికార్జున్ ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ…
PM Narendra Modi: దేశంలో వేగంగా విమానయాన రంగం విస్తరిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మరికొన్ని రోజుల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్కడి అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు మోదీ. మరోసారి కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవాలని అనుకుంటోంది బీజేపీ. దీంతో భాగంగానే కొద్ది రోజుల వ్యవధిలో రెండుసార్లు కర్ణాటకలో పర్యటించారు ప్రధాని. ఇదిలా ఉంటే సోమవారం శివమొగ్గలో నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. హవాయ్ చెప్పులేసుకునే వారు కూడా విమానం ఎక్కాలన్న తమ…
Congress plenary : దేశంలో ద్వేషపూరిత నేరాల ముప్పును పరిష్కరించడానికి, చట్టాన్ని ప్రతిపాదిస్తామని కాంగ్రెస్ తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశం జరుగుతోంది.
త్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాల్లో పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సభ్యులందరినీ నామినేట్ చేసే అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కట్టబెడుతూ పార్టీ స్టీరింగ్ కమిటీ శుక్రవారం నిర్ణయం తీసుకుంది.