Vellampalli Srinivas: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలను వైసీపీ నేతలు నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ 13వ వర్ధంతి సందర్భంగా కంట్రోల్ రూమ్ వద్ద ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్సీ రుహుల్లా, ఇతర నేతలు నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్‌ను తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు అని వ్యాఖ్యానించారు. 2004 నుంచి 2009 వరకు నభూతో న భవిష్యత్ అనేలా…
పక్కరాష్ట్రంలో రోడ్లు, విద్యుత్, నీళ్లు లేవని మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లకు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ లాగే కేటీఆర్ పిట్టకథలు చెబుతున్నారని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ గురించి మాట్లాడే హక్కు టీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. నీళ్లు, కరెంట్, రోడ్లు ఉన్నాయో లేదో విజయవాడకు వచ్చి చూస్తే అర్ధమవుతుందన్నారు. కోస్తా ప్రజల వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. అలా అభివృద్ధి ప్రాంతంగా మారిన హైదరాబాద్…
బీజేపీ రాజ్య సభ సభ్యుడు సీఎం రమేష్ వ్యాఖ్యలను వైసీపీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి ఉడుత ఊపులకు భయపడేది లేదని, కేంద్రమే రాష్ట్ర పోలీసులకు ఈ మధ్య అనేక అవార్డులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశం. ఫెడరల్ విధానంలో ఏ హక్కుతో కేంద్రం రాష్ట్ర పోలీసు వ్యవస్థ పై నిఘా పెడుతుందో సీఎమ్ రమేష్ చెప్పాలి. సీఎం రమేష్ చంద్రబాబు ఏజెంట్ గా మాట్లాడుతున్నాడు.…
భవానీ దీక్షల విరమణ కార్యక్రమం నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈనెల 25 నుంచి 29 వరకు భవానీ దీక్షల విరమణ ఉండటంతో ఏర్పాట్లను మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్ నివాస్, ఇంద్రకీలాద్రి దేవాలయ ఛైర్మన్, ఈవోలతో కలిసి పరిశీలించారు. దీక్షల విరమణ, గిరి ప్రదక్షిణ, కేశ ఖండనశాల, దర్శనం, ప్రసాదం పంపిణీ, అన్న ప్రసాదం వంటి ఏర్పాట్లపై ఆరా తీసిన…
రఘురామ కృష్ణంరాజు ప్రభుత్వాన్ని అస్థిరపరచటానికి కుట్ర పన్నారు. గత ఏడాది కాలంగా ఢిల్లీలో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ ల పేరుతో కులాల మధ్య విద్వేషాలు తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు అని ఎన్టీవీతో వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పైకి రఘురామ కృష్ణంరాజు ఉన్నా వెనుక చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, కొన్ని ఛానల్స్ ఉన్నాయి అని పేర్కొన్నారు. ఏడాది కిందటే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయమని లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశాం…