రఘురామ కృష్ణంరాజు ప్రభుత్వాన్ని అస్థిరపరచటానికి కుట్ర పన్నారు. గత ఏడాది కాలంగా ఢిల్లీలో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ ల పేరుతో కులాల మధ్య విద్వేషాలు తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు అని ఎన్టీవీతో వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పైకి రఘురామ కృష్ణంరాజు ఉన్నా వెనుక చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, కొన్ని ఛానల్స్ ఉన్నాయి అని పేర్కొన్నారు. ఏడాది కిందటే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయమని లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశాం అని చెప్పిన ఆయన చంద్రబాబు, రఘురామ కృష్ణంరాజు మహా నటులు అని తెలిపారు. అయితే ఇప్పుడు సానుభూతి కోసం కొట్టారు అనే ప్రచారానికి తెర లేపారు అని… ఇందులో మరికొన్ని అరెస్టులు తప్పకుండా ఉంటాయి అని అన్నారు.