ప్రభుత్వం చేస్తున్న మంచి పై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వైసీపీ ప్లీనరీలో ఆయన టీడీపీ, జనసేన, బీజేపీలో మండిపడ్డారు. ప్రభుత్వ పథకాల పై ఎల్లో మీడియాతో కలిసి దుష్ప్రచారం చేస్తోంది. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని కార్యకర్తలు సైతం తిప్పికొట్టాలి. 82వేల ఓట్ల మెజారిటీతో ఆత్మకూరులో గెలిచామంటే 2019 కంటే మనం మెరుగ్గా ఉన్నామని అర్ధం. టీడీపీ, జనసేన,బీజేపీ కలిసి పని చేసినా 20 వేల కంటే ఎక్కువ ఓట్లు రాలేదు. ఎవరు ఎవరితో కలిసినా 2024లో వైసీపీ ప్రభుత్వం రావడం ఖాయం…జగన్ సీఎం అవడం ఖాయం అన్నారు విష్ణు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్లీనరీలో టీడీపీ నేతలు,పవన్ కళ్యాణ్‌లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జమల పూర్ణమ్మ. పవన్ కళ్యాణ్ దసరా వేషగాడు. పవన్ కు దసరా మామూలు ఎంత వచ్చింది. గతంలో చంద్రబాబును ఏం ప్రశ్నించావ్ …ఇప్పుడు ఏం ప్రశ్నిస్తావ్? మా నాయకుడిని ప్రశ్నించే దమ్ము నీకు లేదు. రెండు చోట్ల ఓడిపోయావ్ …వార్డు మెంబర్ ను కూడా గెలిపించుకోలేకపోయావ్. నీ వెంట వచ్చే వాళ్లకు ఓట్లు లేవయ్యా…గుర్తుంచుకో. ఈసారి ఐదు చోట్ల పోటీచేయి … ఓడిపోవడం ఖాయం. పవన్ కంటే బ్రహ్మానందం బెటర్. జనంలోకి వెళ్తే బ్రహ్మానందానికి కూడా జనం వస్తారు. పెళ్లిళ్ల పేరుతో ఎంత మంది ఆడవాళ్లను మోసం చేస్తావ్ అన్నారు.
టీడీపీ, జనసేన నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే నాలుకలు తెగకోస్తాం. ఆడవాళ్ల గురించి తప్పుగా మాట్లాడితే అయ్యన్న పాత్రుడు, లోకేష్‌ల తాటతీస్తాం అన్నారు జమల పూర్ణమ్మ. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా రాజకీయాలు వచ్చిన తర్వాత అందరికీ ఎమ్మెల్యేలు టార్గెట్ గా మారారు. వాస్తవాలు గమనించకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అనేలా ఉంది పరిస్థితి. అందరికీ సమన్యాయం జరిగేలా పార్టీలో పదవులు ఇస్తున్నారు. కానీ సొంత కుటుంబ సభ్యులైన పార్టీ శ్రేణుల్లో కొందరు పదవులు రావడం లేదని ప్రచారాలు చేస్తున్నారు. మామీద అన్ని రకాలుగా ఒత్తిడి పెరుగుతోందని కార్యకర్తలు కూడా గమనించాలి. రాబోయే ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలిచి సీఎంకు కానుకగా ఇద్దాం అన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.
AVIS Hospital: మానవత్వం తో కూడిన వైద్య సేవలు మహోన్నతం