Puffer Fish: మలేషియాకు చెందిన 83 ఏళ్ల మహిళ, ఆమె భర్త అత్యంత విషపూరితమైన ‘‘పఫర్ ఫిష్’’ ను తిని ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. ఈ చేపను తిన్న తర్వాత భార్య చనిపోగా, భర్త ఐసీయూలో కోమాలో ఉన్నాడు. ప్రస్తుతం అతడికి చికిత్స చేస్తున్నారు వైద్యులు. వీరి కుమార్తె చెప్పిన దాని ప్రకారం సమీపంలో ఉన్న మార్కెట్ నుంచి ఈ డెడ్లీ చేపను తన తండ్రి కొనుగోలు చేసినట్లు బాధితుల కుమార్తె వెల్లడించారు.
కూరగాయలలో రారాజుగా పిలువబడే బంగాళాదుంపకు భారతదేశం వెలుపల ఉన్న దేశాలలో చాలా డిమాండ్ ఉంది. బంగాళాదుంపలు భారతదేశంలో సులభంగా అందుబాటులో ఉన్నప్పటికీ, కూరగాయలను విదేశాలలో అధిక ధరలకు కొనుగోలు చేస్తారు. మలేషియా, ఖతార్, దుబాయ్‌లోని హోటళ్లు, గృహాల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఆగ్రా నుంచి సుమారు 6,000 క్వింటాళ్ల బంగాళదుంపలు ఎగుమతి అవుతున్నాయి.
Anwar Ibrahim sworn in as Malaysia’s PM: మలేషియా ప్రధానిగా ప్రతిపక్ష నేత అన్వర్ ఇబ్రహీం ఎన్నికయ్యారు. మలేషియా రాజు అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా సమక్షంలో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటుపై కొద్ది రోజులుగా ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడినట్లు అయింది. శనివారం వెలువడిన సాధారణ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ లభించలేదు. అయితే యునైటెడ్ మలేషియన్ నేషనల్ ఆర్గనైజేషన్ తో పొత్తు పెట్టుకున్న అన్వర్ అధికారాన్ని…
India Offers To Sell 18 tejas To Malaysia: భారత్ ఆయుధాాల తయారీలో ఆత్మనిర్భర్ గా తయారయ్యేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇన్నాళ్లు మిలిటరీ సాంకేతికత, పరికరాల, ఆయుధాల కోసం రష్యా, అమెరికా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్ వంటి దేశాలపై ఎక్కువగా ఆధారపడిన ఇండియా ఇటీవల సొంతంగా ఆయుధాలను, అత్యాధునిక క్షిపణులను తయారు చేసుకుంటోంది. తేజస్ తో పాటు ప్రపంచంలోనే అత్యుత్తమైన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిపై పలు దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే వియత్నాం, ఫిలిప్పీన్స్…
మలేసియా వెళ్లడానికి వాల్తేరు వీరయ్య రెడీ అయ్యాడు. ఓ సీక్రెట్ ఆపరేషన్ కోసమే ఈ ప్రయాణమని విశ్వసనీయ సమాచారం. టార్గెట్ ఎవరు? ప్లాన్ ఎలా డిజైన్ చేశారు.. అనే అంశాలు తెలియడాని కొంత సమయం పడుతుంది. కానీ.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సినిమా ఇది. ఇప్పటికే ఈ చిత్రం…