Marriage: ఆంధ్రా అబ్బాయి, మలేసియా అమ్మాయి.. 12 ఏళ్లు నిరీక్షించి ఎట్టకేలకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marriage: ప్రేమకు కులమత వ్యత్యాసాలు ఉండవు. ఆకర్షణ.. పరిచయం చిగురిస్తే చాలు స్నేహితులై.. ఆపై ప్రేమికులై ఒకరి కోసం ఒకరు అనేంతగా దగ్గరవువుతుంటారు యువతీయువకులు. అలాగే తమ ప్రేమను పెళ్లి పీటలెక్కించి సుఖాంతం చేసుకుంటుంటారు. ప్రేమకు హద్దులు ఉండవు. దేశాలు, ఖండాంతరాలు కూడా లేవు అంటారు. సరిగ్గా అలాగే ఆంధ్రా అబ్బాయి.. మలేసియా అమ్మాయి ఒక్కటయ్యారు. పెద్దలను ఒప్పించి మరీ వారి సమక్షంలోనే.. హిందూ వివాహ సంప్రదాయ పద్దతిలో మూడు ముళ్ల బంధంతో భార్యాభర్తలుగా కొత్త జీవితం ప్రారంభించారు.
విశాఖకు చెందిన భవానీ ప్రసాద్, మలేసియాకు చెందిన ఐక్‌వేది హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. దాదాపు 13 ఏళ్ల క్రితం వీరు ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లారు. అక్కడ వీరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఇరు వైపులా పెద్దలకు తమ ప్రేమ గురించి వివరించారు. అమ్మాయి తరపు వారు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తాను పెళ్లి చేసుకోకుండానే ఉండిపోతానని ఆమె స్పష్టం చేసింది. అబ్బాయి కూడా అదే మాట చెప్పి ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. వారిద్దరు స్నేహితులుగానే ఉండిపోయారు. వారు ఎన్నో పెద్ద ఉద్యోగాలు తెచ్చుకున్నా మనస్సు మాత్రం మారలేదు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
Food Poison: ఫుడ్ పాయిజన్.. 36 మంది పాఠశాల విద్యార్థులకు అస్వస్థత
భవానీ ప్రసాద్ ఉద్యోగానికి స్వస్తి చెప్పి సొంతంగా బిజినెస్ చేస్తుండగా.. ఆమె కూడా తన ఉద్యోగం మాని అతని సంస్థలో చేరి వ్యాపార కార్యకలాపాలకు సహకరిస్తున్నారు. ఆ విధంగా 12 ఏళ్లు గడిచిపోయాయి. ఇద్దరికీ 41 ఏళ్లు వచ్చాయి. ఇటీవలే ఐక్‌వే కుటుంబసభ్యులు వీరి పెళ్లికి ఆమోదం తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నడుమ శుక్రవారం వీరి వివాహం జరిగింది.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!