సాధారణంగా ఇంట్లో పాములు కనిపిస్తే భయపడి పరుగులు తీస్తాం. పామును ఇంటి నుంచి బయటకు పంపేవరకు కంగారుపడిపోతాం. అదే విమానంలో పాము కనిపిస్తే ఇంకేమైనా ఉంటుందా చెప్పండి. ప్రయాణికులు ప్రాణాలను అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేయాల్సి వస్తుంది. అందుకే విమానం ఎక్కే ముందు ఫ్లైట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ప్రయాణికుల వస్తువులను స్కాన్ చేస్తారు. మలేషియాకు చెందిన ఎయిర్ ఏసియా ఫ్లైట్ ఏకే 5748 విమానం కౌలాలంపూర్ నుంచి తవాకు బయలుదేరింది. Read: Marriage: పూలకు గిరాకి……
కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏ దారి లేనప్పుడు రోడ్డుపై చేయిచాచి భిక్షాటన చేసి దాతలు ఇచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తుంటారు. అయితే, ఓ మహిళ భిక్షాటన చేస్తూ భారీగా సంపాదిస్తోంది. అంతేకాదు, రోజుకు ఎంత సంపాదిస్తున్నది అనే విషయాలను ఆమె తన డైరీలో రాసుకుంటున్నది. రోజుకు 1500 వరకు సంపాగిస్తున్నట్టు డైరీలో రాసుకున్నది. అంటే నెలకు సుమారు 40 వేలకు పైగా సంపాదన. క్రమం తప్పకుండా ఆ మహిళ రోజూ రోడ్డుపై చిన్నపిల్లవాడిని ఒడిలో కూర్చుబెట్టుకొని భిక్షాటన చేస్తున్నది.…
కరోనా కారణంగా లక్షలాది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా మహమ్మారి అందరికీ చేటు చేస్తే ఆ వ్యక్తికి మాత్రం మంచి చేసింది. మరికొద్ది గంటల్లో ఉరిశిక్ష అమలు చేయాల్సిన ఖైదీకి కరోనా సోకడంతో శిక్షను అమలు చేయడం తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సంఘటన సింగపూర్‌లో జరిగింది. మలేషియాకు చెందిన భారత సంతతికి చెందిన ధర్మలింగం అనే వ్యక్తి మారక ద్రవ్యాల కేసులో సింగపూర్ ధర్మాసనం ఉరిశిక్షను విధించింది. సింగపూర్‌లో 42 గ్రాముల హెరాయిన్…
డబ్బుకోసమో, కోపతాపాలతోనో మనుషులు కిడ్నాప్ వ్యవహారాలకు పాల్పడుతుంటారు. మనుషులను కిడ్నాప్ చేయడం లేదా, పెంపుడు జంతువులను కిడ్నాప్ చేయడం చేస్తుంటారు. మనుషులు మాత్రమే కాదు మేము కూడా కిడ్నాప్ చేయగలమని నిరూపించింది ఓ కోతి. ఓ చిన్న కుక్కపిల్లని కిడ్నాప్ చేసి మూడు రోజులపాటు తనవద్దనే బందీగా ఉంచుకొని స్థానికులకు చుక్కలు చూపించింది. ఈ సంఘటన మలేషియాలోని తమన్ లెస్టారిపుత్రలో జరిగింది. ఓ కోతి రెండు వారాల వయసున్న చిన్న కుక్కపిల్లను కిడ్నాప్ చేసి అడవిలోని చెట్లను…