MH 370 Plan Crash: ఎనిమిదేళ్ల క్రితం అదృశ్యమైన మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 370 సముద్రంలో కూలిపోయిందని నిపుణులు నిర్ధారించారు. 25 రోజుల క్రితం మడగాస్కర్‌లోని మత్స్యకారుల ఇంట్లో దొరికిన విమాన శకలాలను శాస్త్రీయంగా పరిశీలించిన తర్వాత నిపుణులు ఈ అభిప్రాయానికి వచ్చారు. విమానాన్ని ఉద్దేశపూర్వకంగానే కూల్చినట్లు తొలి ఆధారాలు లభించాయని ఎన్‌హెచ్ 370 శిథిలాల వేటగాళ్లు బ్రిటిష్ ఇంజినీర్ రిచర్డ్ గాడ్‌ఫ్రే, అమెరికన్ బ్లెయిన్ గిబ్సన్ తెలిపారు.
మార్చి 8, 2014న 239 మంది ప్రయాణికులతో విమానం అదృశ్యమైంది. అనంతరం విమానం, అందులోని ప్రయాణికుల గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. విమానం అదృశ్యంపై అనేక పుకార్లు వెలువడ్డాయి. 2017లో ఫెర్నాండో తుఫాను తర్వాత, మడగాస్కర్‌లో ఒడ్డుకు కొట్టుకువచ్చిన విమానం ల్యాండింగ్ గేర్ డోర్‌ను టాటాలీ అనే మత్స్యకారుడు తీసుకొచ్చి ఇంటిలో ఉంచాడు. తటాలి భార్య వీటిని బట్టలు ఉతకడానికి వాషింగ్ బోర్డ్‌గా ఉపయోగిస్తోంది. విమానం ల్యాండింగ్ గేర్, డోర్ భాగాలపై పగుళ్లు, గీతలు ఉన్నాయని బ్రిటిష్ ఇంజనీర్ రిచర్డ్ గాడ్‌ఫ్రే చెప్పారు. సముద్రంలో కూలిపోయిన తర్వాత అది పూర్తిగా శిథిలమైపోతుందని నిర్ధారించేందుకు పైలట్ ప్రయత్నించినట్లు నిపుణులు భావిస్తున్నారు. డోర్ పైన ఉన్న నాలుగు సెమీ-సమాంతర పగుళ్లు ఆధారంగా విమానానికి ఉన్న రెండు ఇంజన్‌లలో ఒకటి విఫలమైనందునే దానిని కిందకి దింపినట్లు నిపుణులు నిర్ధారించారు. విమానాన్ని పూర్తిగా రెండుగా చీల్చే విధంగా విమానం ల్యాండింగ్ చేసినట్లు గాడ్‌ఫ్రే, గిబ్సన్ చెప్పారు.
Read Also: Gas Crisis: గృహవినియోగదారులకు షాక్.. రోజులో 8గంటలే గ్యాస్ సరఫరా
మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళుతుండగా ఎంహెచ్ 370 అదృశ్యమైంది. విమానంలో 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. అందరూ చనిపోయినట్లు భావిస్తున్నారు. 227 మంది ప్రయాణికుల్లో 153 మంది చైనా జాతీయులు. ప్రమాదం జరిగిన సమయంలో మలేషియా పైలట్ జహారీ షా విమానం అదుపులో ఉన్నారు. షా ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని కూల్చివేసినట్లు మొదట్లో ఆరోపణలు వచ్చాయి, అయితే షా కుటుంబ సభ్యులు, స్నేహితులు దానిని ఖండించారు. టేకాఫ్ అయిన 38 నిమిషాల తర్వాత విమానంతో చివరి కమ్యూనికేషన్ జరిగింది. ఆ సమయంలో విమానం దక్షిణ చైనా సముద్రం మీదుగా ఉంది. ఆ తర్వాత విమానంతో సంబంధాలు తెగిపోయాయి.
Read Also: Uttar Pradesh: అంత్యక్రియలకు డబ్బు లేక రోజుల తరబడి తల్లి మృతదేహంతోనే..
ఎంహెచ్ 370 కోసం జరిగిన అన్వేషణ విమానయాన చరిత్రలోనే అత్యంత ఖరీదైనది. 2015- 16లో, హిందూ మహాసముద్రం ఒడ్డు నుండి వెలికితీసిన శిధిలాలు ఎంహెచ్ 370 అని నిర్ధారించబడింది. విమానం అదృశ్యం గురించి చాలా పుకార్లు ఉన్నాయి, కానీ ఏదీ నిరూపించబడలేదు. విమానం అదృశ్యంపై మలేషియా ప్రభుత్వం కూడా అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంహెచ్ 370 గురించి పలు డాక్యుమెంటరీలు, నవలలు కూడా వచ్చాయి.