మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ స్థాపించిన నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిలిమ్స్ ప్రస్తుతం పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఒక యువతి, సంస్థ తరపున పనిచేస్తున్నట్లు చెప్పుకున్న అసోసియేట్ డైరెక్టర్ దినిల్ బాబు తనకు సినిమా అవకాశమిస్తానని చెప్పి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. ఈ ఫిర్యాదుతో ఎర్నాకుళం సౌత్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. యువతి తెలిపిన వివరాల ప్రకారం, దినిల్ బాబు తనను “వేఫేరర్ ఫిలిమ్స్” తరఫున మాట్లాడుతున్నానని చెప్పి, తనకు…
మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది! యాక్టర్ల పారితోషికాలు మామూలుగా లేవు. ఏకంగా సినిమా బడ్జెట్‌లో 60 శాతం రెమ్యునరేషన్స్ అందజేస్తున్నారు. ఇండస్ట్రీపరంగా నటీనటులు, టెక్నీషియన్ల పారితోషికాలు భారీగా పెరిగాయి. కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న యాక్టర్లు, డైరెక్టర్లు కూడా ఎక్కువ రెమ్యునరేషన్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, తాజాగా హేమా కమిటీ నివేదికను మలయాళ స్టార్ హీరో, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ స్వాగతించారు. వరసగా మలయాళ నటులపై వస్తున్న లైంగిక ఆరోపణలతో ఇండస్ట్రీ టాప్ బాడీ అయిన అసోసియేషన్ ఆఫ్ మలమాళం మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ)ని రద్దు చేస్తూ, దాని చీఫ్ అయిన మోహన్ లాల్ నిర్ణయం తీసుకున్నారు.
Radikaa Sarathkumar About Secret Cameras: మలయాళ చిత్ర పరిశ్రమలో నటీమణులపై వేధింపుల గురించి ‘జస్టిస్ హేమ కమిటీ’ ఇచ్చిన రిపోర్ట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. హేమ కమిటీ రిపోర్ట్ అనంతరం ఎందరో నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను తెలిపారు. ఈ క్రమంలో సీనియర్ నటి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధిక శరత్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాదు.. చాలా ఇండస్ట్రీల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు. నటీమణుల కారవాన్‌లలో కొందరు…
ఇప్పటి వరకు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాలు మలయాల మూవీ ఆర్టిస్ట్ అసోసియేటన్ ‘‘అమ్మ’’ రద్దుకు దారి తీశాయి. ఈ వేధింపుల ఆరోపణల్లో పలువురు నటులని, నిర్మాతని ప్రశ్నించే అవకాశం ఉంది. 2013లో ఓ సినిమా సెట్‌లో ఒక నటుడు తనను వేధించాడని నటి సోనియా మల్హార్ తాజాగా ఫిర్యాదు చేశారు. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కి ఆమె ఫిర్యాదు చేశారు.
Malayalam cinema: మలయాళ సినీ పరిశ్రమలో మహిళా వేధింపులపై ఇటీవల హేమా కమిటి సమర్పించిన నివేదిక సంచలనంగా మారింది. కొందరు అగ్ర నటులుపై వచ్చిన ఆరోపణలు ప్రకంపలను రేపుతున్నాయి. మలయాళ పరిశ్రమలో మహిళా నటులపై కమిట్‌మెంట్ల పేరుతో వేధింపులు జరిగినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది. అయితే, పరిశ్రమపై వస్తున్న ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధమైంది. మహిళా ఐఏఎస్ అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయాలని పినరయి విజయన్ సర్కార్ ఆదివారం నిర్ణయించింది.