Famous Villain Kazan Khan Died Of Heart Attack: సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. చాలా సినిమాల్లో విలన్‌గా నటించి, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు గడించిన కజాన్ ఖాన్ తుదిశ్వాస విడిచారు. కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. జూన్ 12వ తేదీన (సోమవారం రాత్రి) గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత, ప్రొడక్షన్ కంట్రోలర్ ఎన్ఎమ్ బాదుషా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ‘‘ప్రముఖ విలన్ కజాన్ ఖాన్ గుండెపోటుతో మరణించారు’’ అంటూ ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. సీఐడీ మూసా, వర్ణ పకిట్టు వంటి ఎన్నో సినిమాల్లో కజాన్ ఖాన్ నటించారని.. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నానని తన పోస్టులో బాదుషా రాసుకొచ్చారు. కజాన్ ఖాన్ మరణవార్తతో ఇండస్ట్రీ దిగ్ర్భాంతికి గురయ్యింది. నటుడు దిలీప్‌తో పాటు ఇతర ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.
Honda Dio Launch: కొత్త స్కూటర్‌ని విడుదల హోండా.. ధర, ఫీచర్స్ డీటెయిల్స్ ఇవే!
కాగా.. 1992లో వచ్చిన సెందమిళ్ పాట్టు సినిమాలో బూపతి పాత్రతో కజాన్ ఖాన్ తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అయితే.. 1995లో వచ్చిన ‘ద కింగ్’ సినిమాతో ఆయన పాపులారిటీ గడించారు. అందులో తన పాత్రలో అద్భత నటనాకౌశలం కనబర్చి, అందరి మన్ననలు పొందారు. ఆ తర్వాత కలైగ్నన్, సేతుపతి ఐపీఎస్, డ్యుయెట్, మురై మామన్, ఆనళగన్, కరుప్పు నీలాతో పాటు మరెన్నో సినిమాల్లో నటించారు. తమిళం, మలయాళం, కన్నడ బాషల్లో కలుపుకొని.. 50కి పైగా సినిమాల్లో నటించారు. చివరగా కజాన్ 2015లో వచ్చిన ‘లైలా ఓ లైలా’ సినిమాలో కనిపించారు. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు గుండెపోటుతో ఇండస్ట్రీలో విషాదం నింపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
Sriya Reddy: పవన్ ఓజీలో విశాల్ రెడ్డి వదిన.. పవర్ ఫుల్ అంటూ ట్వీట్