Malayalam cinema: సినిమా రంగంలో మహిళలపై వేధింపులు..సిట్ ఏర్పాటు చేసిన కేరళ సర్కార్..
- మలయాళ సినిమాపై సిట్ ఏర్పాటు చేసిన కేరళ సర్కార్..
- మహిళా వేధింపులపై హేమా కమిటీ సంచలన రిపోర్ట్..
- కమిట్‌మెంట్.. అడ్వాన్స్ పేరుతో మహిళలపై లైంగిక దోపిడి..
- నటి భావన కేసు తర్వాత హేమా కమిటీ ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malayalam cinema: మలయాళ సినీ పరిశ్రమలో మహిళా వేధింపులపై ఇటీవల హేమా కమిటి సమర్పించిన నివేదిక సంచలనంగా మారింది. కొందరు అగ్ర నటులుపై వచ్చిన ఆరోపణలు ప్రకంపలను రేపుతున్నాయి. మలయాళ పరిశ్రమలో మహిళా నటులపై కమిట్‌మెంట్ల పేరుతో వేధింపులు జరిగినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది. అయితే, పరిశ్రమపై వస్తున్న ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధమైంది. మహిళా ఐఏఎస్ అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయాలని పినరయి విజయన్ సర్కార్ ఆదివారం నిర్ణయించింది.
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై వేధింపులు, దోపిడీలు, దుర్వినియోగం మరియు ఇతర మానవ హక్కుల ఉల్లంఘన సంఘటనలను వెల్లడించిన జస్టిస్ కె హేమ కమిటీ నివేదిక ఆధారంగా సమగ్ర పోలీసు దర్యాప్తు ప్రారంభించాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను డిమాండ్ చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. సిట్‌కి ఐజీ ర్యాంక్ అధికారిణి స్పర్జన్ కుమార్ నేతృత్వం వహిస్తారు. ఇతర సీనియర్ మహిళా అధికారులు సిట్‌లో ఉండనున్నారు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
Read Also: Nagarjuna Akkineni: సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు.. కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటా..
అంతకుముందు, ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాత రంజిత్‌పై బెంగాల్ నటి శ్రీలేఖ మిత్ర సంచలన ఆరోపణలు చేశారు. 2009లో రంజిత్ దర్శకత్వం వహించిన ‘‘పలేరి మాణిక్యం: ఒరు పతిర కోలపతకతింటే కథ’’ సినిమా ఆడిషన్ సందర్భంగా తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు వెల్లడించింది. తనకు సినిమా అవకాశం ఇస్తానని, సినిమా గురించి చర్చించేందు హోటల్ గదికి రమ్మన్నాడని ఆమె చెప్పింది. గదిలోకి వెళ్లిన తర్వాత తనతో అసభ్యం ప్రవర్తించడంతో షాక్ గురై అక్కడ నుంచి బయటకు వచ్చినట్లు వెల్లడించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి రంజిత్ రాజీనామా చేశాడు.
2017లో నటి భావనపై కారులో లైంగిక దాడి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆమెను కారులో తిప్పుతూ దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కేసులో కీలక నిందితుడిగా స్టార్ హీరో దిలీప్ ఉన్నాడు. ఈ ఘటన తర్వాత అప్పటి ప్రభుత్వం మలయాళ ఇండస్ట్రీలో మహిళల వేధింపులకు సంబంధించి రిపోర్టు ఇవ్వాలని జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నటి శారద, మాజీ ఐఏఎస్ అధికారిణి కేబీ వత్సల కుమారి సభ్యులుగా ఉన్నారు. 2019లో ఏర్పడిన కమిటీ తన నివేదికలో సినీ ఇండస్ట్రీలో అకృత్యాలను వెలుగులోకి తీసుకువచ్చింది. కాస్టింగ్ కౌచ్‌తో పాటు లైంగిక దోపిడికి సంబంధించిన దిగ్భ్రాంతికరమైన విషయాలను కమిటీ రిపోర్టు వెల్లడించింది. ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు, దోపిడి, అసభ్యంగా ప్రవర్తించడం సహజంగా మారిందని నివేదిక వెల్లడించింది. పరిశ్రమను ‘‘క్రిమినల్ గ్యాంగ్స్’’ నియంత్రిస్తున్నాయని ఆరోపించింది. తమకు లొంగని మహిళల్ని వేధిస్తున్నారని, కొంతమంది నిర్మాతలు, దర్శకులు, నటులు, ప్రొడక్షన్ కంట్రోలర్లతో కూడిన ‘‘పవర్ నెక్సస్’’ ఉందని ప్యానెల్ ఆరోపించింది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?