కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజికవర్గం డామినేషన్ ఎక్కువ. అలాంటి పార్టీలో బీసీ సామాజికవర్గానికి చెందిన మధుయాష్కీ పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా.. మహేష్‌గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలను మహేష్‌గౌడే పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరు బీసీ నేతలు పార్టీలో కీలక పదవుల్లో ఉన్నప్పటికీ సఖ్యత లేదు. నిత్యం కయ్యమే. గాంధీభవన్‌లో ఇద్దరు గౌడ్‌లు కలిశారంటే.. ఉప్పు నిప్పులా ఉంటారు. అసలు ఈ ఇద్దరికీ ఎక్కడ తేడా కొట్టింది అనేది ఎవరికీ అంతుచిక్కదు.…
కాంగ్రెస్ నాయకుల కృషితోనే సభ్యత్వాలను పూర్తి చేశామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు 20 లక్షలు పూర్తి అయిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సభ్యత్వ నమోదును మరో నాలుగు రోజులు పొగిస్తున్నట్టు తెలిపారు. జనవరి 30 నాటికి 30 లక్షల సభ్యత్వం పూర్తి చేస్తామని మహేష్ గౌడ్ వెల్లడించారు. పార్టీ సభ్యత్వాల్లో టార్గెట్ పూర్తి చేయని వారిపై పార్టీ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.సభ్యత్వ నమోదును లైట్‌గా తీసుకున్న నాయకులపై పార్టీ చర్యలు…
గత రెండు రోజులుగా బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం పట్ల రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య రాజకీయ డ్రామా నడుస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్‌ఎస్‌ల లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే రాష్ట్రంలో రచ్చ చేస్తున్నాయన్నారు. అరెస్ట్ చేయాల్సిన అవసరం లేకున్నా.. సంజయ్ నీ అరెస్ట్ చేశారని, నడ్డాను కూడా అరెస్ట్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు…
కాంగ్రెస్ పోటీ చేసిన రెండు స్థానాల్లో మాకు ఉన్న ఓట్ల కంటె ఎక్కువే వచ్చాయి. కాబట్టి భట్టి విక్రమార్క , జగ్గారెడ్డి విజయం సాధించారు అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. టీఆర్ఎస్ ఓట్లు మాకు వచ్చాయి అంటే.. టీఆర్ఎస్ పై వ్యతిరేకత కనిపిస్తుంది అన్నారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచినా..నైతికంగా ఓడిపోయింది. నల్గొండలో అభ్యర్థిని పెట్టకపోయినా..ఇండిపెండెంట్ అభ్యర్థికి మా పార్టీ వారు ఓటేసారు. స్థానిక సంస్థల పట్ల టీఆర్ఎస్ వ్యతిరేక దోరణి..…
రేపు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ జెండా పండుగ జరుపుతున్నాం. రేపు అన్ని పోలింగ్ బూత్ స్థాయి లతో పార్టీ జెండా ఎగురేయాలని పీసీసీ నిర్ణయించింది అని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సోనియా గాంధీ జన్మదినం తోపాటు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు డిసెంబర్ 9. రేపు ఈ రెండు ప్రాధాన్యతలు కలిగిన రోజు కాబట్టి పార్టీ డిజిటల్ మెంబర్ షిప్ ప్రారంభిస్తున్నాము. రేవంత్ రెడ్డి కొడంగల్ అసెంబ్లీ పరిధిలోని పోలింగ్…
తెలంగాణలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు గురించి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ పై సోనియా గాంధీ ప్రకటన చేసిన రోజు డిసెంబర్ 9… అందుకే డిసెంబర్ 9 ఉదయం 10 గంటల నుండి సభ్యత్వ నమోదు ప్రారంభిస్తున్నాము అని తెలిపారు. ఈసారి డిజిటల్ సభ్యత్వ నమోదు ఉంటుంది.కొల్లాపూర్ లో రేవంత్, మధిర లో సిఎల్పీ నేత భట్టి సభ్యత్వ నమోదులో పాల్గొంటారు. 30 లక్షల సభ్యత్వం లక్ష్యం గా పెట్టుకున్నాము. జనవరి 26…
ఈ నెల 9, 10 తేదీల్లో కాంగ్రెస్ శిక్షణా తరగతులు ఉంటాయని టీపీసీసీవర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.డిజిటల్ సభ్యత్వ నమోదుపై డీసీసీలకు, నియోక జవర్గం నుంచి ఒకరికి శిక్షణ నిర్వహిస్తామని పేర్కొన్నారు. రెండు రోజు ల పాటు కొంపల్లిలో శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. ఈ మేర కు ఏర్పాట్లను మహేష్ గౌడ్ తోపాటు సీనియర్ ఉపాధ్యక్షుడు వేం నరేం దర్ రెడ్డి, అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డీ పరిశీలించారు. అనంతరం…
హుజూరాబాద్ ఎన్నికల వ్యూహం పై చర్చ చేశాం. మండలంకి ఓ ఇంచార్జీ, వారీతో పాటు నలుగురు నాయకులు అలాగే గ్రామానికి ఓ ఇంఛార్జి నియామకం చేస్తున్నం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ తెలిపారు. హుజూరాబాద్ లో కార్యకర్తల బలం మీదే మా నమ్మకం అని చూపిన ఆయన వందల కోట్లు దండుకుంటున్నారు తెరాస కి ఓటు వేస్తారా… లేదా పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పేదల నడ్డి విరుస్తున్న బీజేపీ కి ఓటు వేయాలో ఆలోచిస్తున్నారు…
సెప్టెంబర్ మొదటి వారంలో రాహుల్ గాంధీ పర్యటన ఉండనున్నట్లు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ తెలిపారు. 11వ తేదీ నుండి హుజూరాబాద్ లో 7 సభలు. మండల కేంద్రాల్లో సభలు పెట్టనున్నట్లు స్పష్టం చేసారు. ఈటల మీద విచారణ జరిపిన నివేదికలు ఏమయ్యాయి అని ప్రశ్నించిన ఆయన ఈటల బీజేపీ లో చేరడానికి కేసీఆర్ కారణం అని పేర్కొన్నారు. ఈటల బీజేపీ లో చేరిన వెంటనే విచారణలు ఎందుకు ఆగిపోయాయి. హుజురాబాద్ నియోజక వర్గ అభ్యర్థిత్వం…
కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్రమశిక్షణ కలిగిన కార్యకర్త. కానీ ఇవాళ ఆయన క్రమశిక్షణ ఉల్లంఘించారు అని అన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్. కోమటిరెడ్డికి ఎన్నో పదవులు వచ్చాయి… అప్పుడు కూడా డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారా అని ప్రశ్నిచారు. పీసీసీ అడగడం లో తప్పు లేదు. పదవీ రాలేదని నిందలు వేయడం సబబు కాదు. కోమటిరెడ్డి వెంటనే తన వ్యాఖ్యలు ఉప సంహరించుకోవలి. లేదంటే క్రమశిక్షణ చర్యలు అధిష్ఠాన తీసుకుంటుంది. కోమటిరెడ్డి వ్యాఖ్యలు… పార్టీ కార్యకర్తల మనోభావాలు…