రేపు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ జెండా పండుగ జరుపుతున్నాం. రేపు అన్ని పోలింగ్ బూత్ స్థాయి లతో పార్టీ జెండా ఎగురేయాలని పీసీసీ నిర్ణయించింది అని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సోనియా గాంధీ జన్మదినం తోపాటు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు డిసెంబర్ 9. రేపు ఈ రెండు ప్రాధాన్యతలు కలిగిన రోజు కాబట్టి పార్టీ డిజిటల్ మెంబర్ షిప్ ప్రారంభిస్తున్నాము. రేవంత్ రెడ్డి కొడంగల్ అసెంబ్లీ పరిధిలోని పోలింగ్ బూత్ లో పార్టీ డిజిటల్ మెంబర్ షిప్ కార్యక్రమంలో పాల్గొంటారు.
అయితే కాంగ్రెస్ మెంబర్ షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ కల్పిస్తున్నాం. పార్టీ నియమించిన కోఆర్డీనేటర్స్ ద్వారా ఈ మెంబర్ షిప్ కార్యక్రమం జరుగుతుంది. జూన్ 26 వరకు పార్టీ డిజిటల్ మెంబర్ షిప్ కొనసాగుతుంది అన్నారు. కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ బలం అని చెప్పిన ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉంది. ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. వడ్ల కొనుగోలు పై టీఆరెఎస్, బీజేపీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ కార్పొరేట్ పార్టీ .. కాంగ్రెస్ సామాన్యుల పార్టీ అని పేర్కొన్నారు.