నాగచైతన్య ‘లవ్ స్టోరీ’తో ఆరంభం హీరోగా టాప్ లీగ్ లోకి వెళ్లాలనుకుంటున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇక కెరీర్ ఆరంభం నుంచి సినిమాలతో బిజీగా ఉన్నా బిజినెస్ పైనా దృష్టి పెట్టాడు. రౌడీ బ్రాండ్ పేరుతో దుస్తుల వ్యాపారం ఆరంభించి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఇతర హీరోల తరహాలో థియేటర్ వ్యాపారంలోనూ తనదైన ముద్ర వేసేందుకు అడుగు ముందుకు వేశాడు. డిస్ట్రిబ్యూటర్స్ ఏషియన్ సినిమాస్ వారితో చేతులు కలిపి మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి…
టాలీవుడ్ లో యాడ్స్ రంగంలో మహేశ్ బాబుకు ఎదురు లేదనే చెప్పవచ్చు. మహేశ్ చేసిన, చేస్తున్నన్ని ప్రకటనలు మరే హీరో చేయటం లేదు. టాప్ బ్రాండ్స్ అన్నీ ప్రచారం కోసం మహేశ్ ముంగిట్లోనే వాలుతున్నాయి. ఇటీవల పాన్ బాహర్ యాడ్ లో తళుక్కుమన్న మహేశ్ ఫ్లిఫ్ కార్డ్ వారి లేటెస్ట్ యాడ్ లో మెరిశాడు. ప్రముఖ ఇ-కామర్స్ బ్రాండ్ ఫ్లిప్కార్ట్ గతంలో మహేశ్ తో ప్రకటన చేసినప్పటికీ తాజాగా మరో యాడ్ రూపొందించింది. అది ఆన్ లైన్…
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన “మహర్షి” చిత్రం 2019లో విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమా విడుదలై రెండేళ్లు గడిచినా అవార్డులు, ప్రశంసలు అందుకుంటూనే ఉంది. నిన్న సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల 6 వ, 7 వ ఎడిషన్ హైదరాబాద్లో జరిగింది. ఈ అవార్డ్స్ వేడుకలో 2019 సంవత్సరానికి గాను సూపర్ స్టార్ ఉత్తమ నటుడిగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు స్వయంగా అవార్డు అందుకున్నారు. “మహర్షి” మరో రెండు ప్రధాన…
దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం తాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి, విడుదల చేయాలన్నది జక్కన్న ఆలోచన. అక్టోబర్ 13న విడుదల చేస్తామని ప్రకటించిన ఈ సినిమా మరోసారి వాయిదా పడిన విషయం తెలిసిందే. 2022 జనవరిలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజమౌళి నెక్స్ట్ మూవీ ఏంటన్న విషయంపై అందరి దృష్టి పడింది. అయితే మహేష్ బాబుతో…
హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన చిన్నారి ఘటనపై నటుడు మహేష్ బాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు చేపట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలనీ అధికారులను మహేష్ కోరారు. సమాజం ఎంతగా పడిపోయిందో ఈ ఘటన గుర్తుచేస్తుందన్నారు. ఆడపిల్లలు ఎప్పుడు సురక్షితంగా ఉంటారా? అనేది ఎల్లప్పుడూ ఒక ప్రశ్నగానే మిగిలిపోతుందని మహేష్ బాబు ఆవేదనగా ట్వీట్స్ చేశారు. నటుడు మంచు మనోజ్ కూడా ఈరోజు చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ…
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ మహేష్ బాబు బాటలో నడవడానికి సిద్ధమైపోయారు. ఆయన మల్టీప్లెక్స్ థియేటర్ల బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికే ఆయన థియేటర్ నిర్మాణం పూర్తయ్యిందని తెలుస్తోంది. నటుడిగా, నిర్మాతగా ఎదిగిన విజయ్ దేవరకొండ ఇప్పుడు బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ ఫుల్ అవ్వడానికి ప్రయత్నాలు మొదలెట్టాడు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే తన “రౌడీ” బ్రాండ్ తో బట్టలు అమ్ముతున్న విషయం తెలిసిందే. ఇంకా తన బిజినెస్ ను విస్తరించుకోవడానికి…
వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు వైభవంగా జరుపుకుంటున్నారు. కోవిడ్ నిబంధనలతో గణేశుడు మండపాలల్లో కొలువుదీరాడు. పలువురు సినీ ప్రముఖులు చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో మట్టితో చేసిన వినాయకుడికి భార్యతో కలిసి పూజలు చేశారు. మరోవైపు, సినీనటుడు మోహన్ బాబు విఘ్నేశ్వరుడి పూర్తి కథను చెప్పారు. ఈ కథ చెప్పాలని తన కుమారుడు మంచు విష్ణు కోరడంతో ఈ కథ చెబుతూ ఈ ఆడియో రికార్డు చేశానని…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల కాలంలో సినిమాకు మాత్రమే సంబంధించి కాకుండా ఇతర కార్యక్రమాలతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన ఒక ఫిట్నెస్ సెంటర్ ను ప్రారంభించారు. “మై ఓ మూమెంట్” అనే లైఫ్ స్టైల్ క్లబ్ ను లాంచ్ చేశారు. అందులో ఫిట్ నెస్, న్యూట్రిషన్, ఫీజియోథెరపీ వంటి సేవలను అందించనున్నారు. “ఫిట్నెస్ కోసం నా అన్వేషణలో ప్రపంచంలోని అత్యుత్తమ శిక్షకులతో పనిచేసే అవకాశం నాకు లభించింది. గాబ్రియేల్ మినాష్ ఆ జాబితాలో అగ్రస్థానంలో…
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం “సర్కారు వారి పాట”. ఈ సినిమా లొకేషన్లోకి నిన్న ఒక ప్రత్యేక అతిథి విచ్చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్, మహేష్ బాబు బావమరిది జయదేవ్ గల్లాతో కలిసి “సర్కారు వారి పాట” షూటింగ్ సెట్లో మహేష్ ను కలిశారు. శశి థరూర్ కేరళలోని తిరువనంతపురం నుంచి ఎంపీగా ఉన్నారు. జయదేవ్ పార్లమెంటులో గుంటూరు లోక్ సభ సెగ్మెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.…
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా మహానటి కీర్తి సురేష్నటిస్తోంది. అయితే 2022 సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ వేగంగా జరుగుతుంది. అయితే తాజాగా సర్కారు వారి పాట సినిమా సెట్ లో మహేష్ బాబు ను కలిశారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. ఆ సమయంలో ఎంపీ గల్లా జయదేవ్ కూడా అక్కడే…