సూపర్ స్టార్ మహేశ్ బాబు, అందాల నటి కీర్తిసురేష్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం వరకు కంప్లీట్ అయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అంతేకాకుండా ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకవచ్చేందుకు మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తుండగా, తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మహేశ్ బాబు రికార్డుల జాబితాలో నిలుస్తుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్, టీజర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు మరో తాజా అప్డేట్ ను చిత్ర యూనిట్ పంచుకుంది.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ బార్సినాలో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. మైండ్ బ్లోయింగ్ లోకేషన్లలో హీరో, హీరోయిన్లపై డ్యూయట్స్, లవ్ సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. బార్సినాలో చిత్రీకరణ పూర్తి అయ్యాక హైదరాబాద్ లో షూట్ నిర్వహించనున్నట్లు సమాచారం.