సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట బ్లాస్టర్” అనుకున్న దానికంటే కొన్ని గంటల ముందుగానే విడుదల చేశారు. చాలాకాలం నుంచి మహేష్ మూవీ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకు “సర్కారు వారి పాట బ్లాస్టర్”తో సర్ప్రైజ్ ఇచ్చారు. ఒక నిమిషం, పదిహేడు సెకన్ల ఈ టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. టీజర్ మహేష్ బాబుని అభిమానులు ఊహించినట్లుగానే సూపర్ గా చూపించింది. మహేష్ స్టైలింగ్ కూడా సూపర్. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో మహేష్ టేక్ ఇట్ ఈజీ యాటిట్యూడ్ అదిరిపోయింది.
Read Also : న్యూమరాలజీతో చిత్రసీమను షేక్ చేస్తున్న బాబు గారు!
ఈ టీజర్లో చాలాకాలం తరువాత పోకిరి వైబ్‌లతో అభిమానులను ఆకట్టుకునే మాస్, స్టైల్ ఉంది. డైలాగ్ తర్వాత వచ్చిన యాక్షన్ సీన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కీర్తి సురేష్ అందంగా కన్పించింది. ఆ తర్వాత మహేష్ బాబు నడక, స్వాగ్ అభిమానులకు క్రేజీ ట్రీట్. ఇక తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. మాది కెమెరా పనితనం కూడా అద్భుతంగా ఉంది. “సర్కారు వారి పాట” సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 13, 2022 న విడుదలవుతుంది. దర్శకుడు పరశురామ్ అభిమానులకు, ప్రేక్షకులకు నిజమైన సూపర్ స్టార్ ట్రీట్ అందిస్తున్నట్లు టీజర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. ఈ రోజు మహేష్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు “బ్లాస్టర్” ట్రీట్ తో ఫుల్ ఖుషీగా ఉన్నారు.