సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అయితే ఈరోజు సోషల్ మీడియాలో ఆయన బర్త్ డే పెద్ద పండుగలా కనిపిస్తుంది. టైమ్‌లైన్‌లు మిలియన్ల కొద్దీ ట్వీట్‌లతో నిండి పోయాయి. సూపర్‌స్టార్‌ను అభిమానుల నుండి అతని కోస్టార్‌లు, ప్రముఖుల వరకు పుట్టినరోజు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. ఈ తుఫానుకు తోడుగా “సర్కారు వారి పాట బ్లాస్టర్” అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1:17 నిమిషాల వీడియో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఇది ప్రతి గంటకు మిలియన్ల వీక్షణలు, వేలల్లో లైక్‌లను పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే ఈ టీజర్ కు 10 మిలియన్ల వ్యూస్, 500కే + లైక్స్ వచ్చాయి. ఇంకా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడానికి “బ్లాస్టర్” జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. యూట్యూబ్ ట్రెండ్‌ల జాబితాలో నెంబర్ వన్ స్థానంలో ఉంది.
Read Also : చరణ్ ని డ్రమ్స్ ప్రాక్టీస్ ఏమైందన్న తారక్
మరోవైపు సూపర్ స్టార్ పుట్టినరోజు, “సర్కారు వారి పాట” చుట్టూ జరుగుతున్న ఈ హంగామా ట్విట్టర్ దృష్టిని కూడా ఆకర్షించింది. ట్విట్టర్ సెలబ్రిటీల అందరి విషెస్ ను ఒక జాబితాలో ఆర్కైవ్ చేసి, దానిని “ట్విట్టర్ మూమెంట్స్ ఇండియా”లో ప్రదర్శించడం విశేషం. ట్విట్టర్ అధికారిక హ్యాండిల్ “ట్విట్టర్ మూమెంట్స్ ఇండియా”లో కన్పించిన మొదటి స్టార్ బహుశా మన సూపర్ స్టార్ అయ్యి ఉండొచ్చు. మరి సోషల్ మీడియాలో ఆయన అభిమానులు చేస్తున్న రచ్చ ఆ రేంజ్ లో ఉంది. ఈ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్ అయిపోవాల్సిందే. సూపర్ స్టార్ అభిమానులా మజాకా !
Happy birthday, Mahesh Babu! 🎂
— Twitter Moments India (@MomentsIndia) August 9, 2021
https://t.co/59cQ5denlt