ఈరోజు (శనివారం) ఉప ముఖ్య కార్య నిర్వాహణాధికారి పూల నర్మద పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలం కొత్తపేట గ్రామంలోని ఫంక్షన్ హాల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గౌరవ కలెక్టర్ మహబూబాబాద్, గౌరవ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మహబూబాబాద్, జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చాల్సిన ఆర్టీసీ అధికారులే బస్సులో మందు కార్యక్రమం మొదలు పెట్టారు.. మద్యం సేవిస్తూ.. ముక్కలు తింటూ.. చిందులేశారు.
Mahbubabad: మహబూబాబాద్ జిల్లాలో చేపల చెరువు లూటీకి గురైంది. వేల సంఖ్యలో గ్రామస్తులు చెరువు దగ్గరకు వచ్చి చెరువులో చేపలను పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నెరడ పెద్ద చెరువులో మత్స్యకారులు చేపల వేట సాగిస్తుండగా,..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. మహబూబాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్లమెంట్ ఇంచార్జ్ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.
మహబూబాబాద్ జిల్లా పొనుగోడులోని స్టోన్స్ క్రస్సర్లో అర్ధరాత్రి బాంబు బ్లాస్టింగ్ చేశారు. దీంతో.. గూడూరు మండలం పొనుగోడు గ్రామ శివారులోని రేణుక స్టోన్స్ క్రస్సర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్లాస్టింగ్ తో తమ గ్రామానికి ప్రమాదం జరుగుతుందని రేణుక క్రస్సర్ యాజమాన్యాన్ని గాజులగట్టు గ్రామస్తులు అడ్డగించారు. బాంబు పేలుళ్ళకు ఒక్కసారిగా భయంతో ఇళ్లలో నుంచి గ్రామస్తులు రోడ్లపైకి పరుగులు తీశారు. అంతేకాకుండా.. భారీ పేలుళ్ళకు ఇళ్ల గోడలకు బీటలు, ప్రమాదకరంగా నెర్రలు పడ్డాయని ఆరోపిస్తున్నారు.
Telangana Elections 2023: తెలంగాణ లోని పలు జిల్లాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. వివరాలలోకి వెళ్తే.. నేడు మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించనున్నారు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను నేతలు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను మంత్రి దయాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి…
మహబూబాబాద్ లో బీజేపీ రాష్ట్ర ఎలక్షన్ కమిటీ ఛైర్మన్, హూజారాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు. సెకండ్ ఎఎన్ఎంల దీక్ష 11 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపాడు.
Brother kills Sister for making YouTube Videos in Mahbubabad: సొంత చెల్లినే ఓ అన్న రోకలిబండతో కొట్టి చంపాడు. యూట్యూబ్ వీడియోలు చేస్తోందన్న ఆగ్రహంతో చెల్లెలిపై రోకలిబండతో దాడి చేశాడు. తీవ్ర గాయాలపైన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈ విషాద ఘటన కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో మృతురాలి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి..…
ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్, మణికొండ, సికింద్రాబాద్, కూకట్ పల్లి, లక్డీకపూల్, మెహిదీపట్నంలో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షం కారణంగా నగర పరిసరాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఉదయం పూట పరిశ్రమలు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.