Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buchi Babu: ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి తన మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా. ఇటీవల ఆయన పెద్ది సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు కీలక పాత్రలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ చిత్రం ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. అయితే తాజాగా బుచ్చిబాబు సానాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజా సమాచారం ప్రకారం.. బుచ్చిబాబు తొలిసారి నిర్మాతగా మారేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఓ చిన్న బడ్జెట్ చిత్రాన్ని నిర్మించే ఆలోచనలో ఆయన ఉన్నారని, దీనికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా, ఈ సినిమా ద్వారా తన బంధువుల కుటుంబానికి చెందిన ఓ యువకుడిని హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారనే వార్త కూడా జోరుగా వినిపిస్తోంది. ఇప్పటి వరకు దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్న బుచ్చిబాబు, ఇప్పుడు నిర్మాతగా మారారనే వార్తలు బయటికి రావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. కొత్త ప్రతిభను ప్రోత్సహించే ప్రయత్నంగా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక బయటికి రావాల్సి ఉంది.
Also Read
తాజావార్తలు
-
AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
-
Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
-
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!