గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. మహబూబాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్లమెంట్ ఇంచార్జ్ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 19న కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ నియోజకవర్గానికి ఇంచార్జ్‌గా ఉన్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: YS Avinash Reddy: న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది.. వివేకా కేసులో అన్ని నిజాలు బయటకు వస్తాయి..
గత ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ధ్వజమెత్తారు. నీటి వనరులను కూడా అస్తవ్యస్తం చేసిన ఘనులు గత పాలకులు అని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఆగస్టు 15 లోపు రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాపీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని గుర్తుచేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటిలోనూ తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామని పేర్కొ్నారు. ఈ నెల 19న భద్రాచలంలో రాముల వారి పట్టాభిషేకం, రాముల వారి దీవెనలతో బలరాం నాయక్ నామినేషన్ వేస్తారని మంత్రి చెప్పారు.
ఇది కూడా చదవండి: Maruti Suzuki Swift: వచ్చే నెలలో మారుతి న్యూ స్విఫ్ట్ లాంఛ్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కాగా.. ఏప్రిల్ 26న సెకండ్ విడత, మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో పోలింగ్ మే 13న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Boyapati Sreenu: అఖండ సీక్వెల్‌పై బోయపాటి కీలక అప్డేట్