Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Box Office Clash: ఈ శుక్రవారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొనబోతోంది. ఒకే రోజు నాలుగు విభిన్న జానర్లకు చెందిన సినిమాలు రిలీజ్ అవుతుండటంతో సినీ అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. హారర్ కామెడీ నుంచి యాక్షన్ డ్రామా వరకు పలు రకాల స్టోరీలతో ఈ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో అందరిలో ఎక్కువ అంచనాలు నెలకొన్న చిత్రంగా ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) నిలిచింది. హారర్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ ఏర్పడింది. ప్రమోషనల్ కంటెంట్‌కు వచ్చిన స్పందనతో ఈ సినిమా ఓపెనింగ్స్‌పై ట్రేడ్ వర్గాలు ఆశావహంగా ఉన్నాయి.
ఇక ‘కేజేక్యూ’ (KJQ) యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదలకు ముందు ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తుండగా, బాక్సాఫీస్ వద్ద సర్ప్రైజ్ హిట్‌గా నిలవాలని చిత్రబృందం ఆశిస్తోంది. మరోవైపు ‘అనకాపల్లి’ (Anakapalli) గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఎమోషనల్ కథతో పాటు మాస్ అంశాలు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. విడుదలకు ముందు ఈ చిత్రంపై కూడా పాజిటివ్ బజ్ ఏర్పడింది. అలాగే ‘డీసీ: ది బ్లడీ వాలెంటైన్’ (DC The Bloody Valentine) యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విభిన్న జానర్లలో తెరకెక్కిన ఈ నాలుగు చిత్రాలు ఒకేసారి బరిలోకి దిగుతుండటంతో ఈ వారం బాక్సాఫీస్ పోటీ మరింత ఆసక్తికరంగా మారిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రేక్షకులను ఏ సినిమా ఎక్కువగా ఆకట్టుకుంటుందో చూడాలి.
Also Read
- Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
- Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
- Kabir Duhan Singh: 'హనుమాన్ అంశ్' బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!