Srisailam Water Release: గుడ్‌న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Water Release: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త చెబుతూ.. శ్రీశైలం డ్యామ్ నుంచి నీటిని విడుదల చేశారు.. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో తాగునీటి భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. 2027 జూన్ వరకు సూపర్ ఎల్‌నినో ప్రభావం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో శ్రీశైలం జలాశయంలోని నీటిని ప్రధానంగా తాగునీటి అవసరాల కోసం భద్రపరచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 119 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, రాబోయే పది రోజుల్లో మరో 100 టీఎంసీల వరకు ఇన్‌ఫ్లో వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. కృష్ణా నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 63 శాతం వాటాను ముందుగా తాగునీటి అవసరాలకే వినియోగిస్తామని స్పష్టం చేశారు.
రాయలసీమలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం నుంచి నీటి విడుదల చేపడుతున్నామని చెప్పారు మంత్రి నిమ్మల.. హంద్రీ-నీవా పరిధిలోని రిజర్వాయర్లకు 13 టీఎంసీల నీరు అవసరమని, అలాగే పోతిరెడ్డిపాడు పరిధిలోని రిజర్వాయర్లకు తాగునీటి కోసం రేపటి నుంచి 10 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక, తెలుగు గంగ పథకం ద్వారా చెన్నై తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉందని, నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల పరిధిలోని తాగునీటి అవసరాల కోసం మరో 32 టీఎంసీల నీరు అవసరమని మంత్రి వివరించారు. వర్షాలు, వరదల పరిస్థితులను ప్రతి వారం సమీక్షిస్తూ ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేలా కార్యాచరణ రూపొందిస్తామని నిమ్మల రామానాయుడు తెలిపారు. జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి రాష్ట్రంలో తాగునీటి భద్రతకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు..
Also Read
- Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.!
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
తాజావార్తలు
-
Mann Ki Baat: ‘వోకల్ ఫర్ లోకల్’తో ప్రపంచ మార్కెట్లలోకి భారత ఉత్పత్తులు!.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Home Minister Anitha: ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. హోంమంత్రి కీలక సూచనలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!