Aurangzebs Tomb: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి ఉంది. అయితే, ఈ సమాధిని తొలగించాలంటూ గత కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో హింసాత్మక నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో నాగపూర్ లో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో మొఘల్ సామ్రాజ్య చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడు యాకూబ్ హబీబుద్దీన్.. ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్స్ కు లేఖ రాశారు. వక్ఫ్ ఆస్తులకు కేర్ టేకర్ గా ఉన్న ముతావలి ప్రిన్స్ యాకూబ్ హబీబుద్దీన్ తన తన లేఖలో.. ఔరంగజేబులో సమాధికి రక్షణ కల్పించాలని వేడుకున్నారు.
Read Also: TDP: గంటా ట్వీట్‌పై టీడీపీ అధిష్టానం సీరియస్.. మరోసారి పునరావృతం అయితే..!
అయితే, వాస్తవానికి ఆ సమాధిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన కట్టడంగా ప్రకటించారని యాకూబ్ హబీబుద్దీన్ పేర్కొన్నారు. కానీ, 1958 నాటి ప్రాచీన కట్టడాలు, ఆఆర్కియాలజీ సైట్ల పరిరక్షణ చట్టం ప్రకారం.. మొఘల్ సామ్రాజ్య అధినేత ఔరంగజేబు సమాధి దగ్గర ఎటువంటి నిర్మాణాలు చేపట్ట వద్దని డిమాండ్ చేశారు. సమాధి దగ్గర ఎలాంటి తవ్వకాలు, కూల్చడం, మార్పులు చేయడం లాంటివి చేయరాదని పేర్కొన్నారు. ఔరంగజేబు సమాధి దగ్గర భారీ స్థాయిలో సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలని యాకూబ్ హబీబుద్దీన్ తన లేఖలో కోరారు. ఔరంగజేబు సమాధికి చట్టపరమైన రక్షణ కల్పించేందుకు భారత ప్రభుత్వానికి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కు తక్షణ ఆదేశాలు ఇవ్వాలని ఆయన తన లేఖలో ఐక్యరాజ్య సమితిని కోరారు.