Aggregator Cab Policy: ఓలా, ఉబర్ ప్రయాణికులకు ఒక శుభవార్త. మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అగ్రిగేటర్ క్యాబ్స్ పాలసీ 2025 కింద కొత్త ఆదేశాన్ని అమలులోకి తీసుకవచ్చింది. దీని ప్రకారం ఓలా, ఉబర్, రాపిడో వంటి ప్రముఖ రైడ్-హెయిలింగ్ సేవలు డ్రైవర్ రైడ్‌ను రద్దు చేసుకుంటే వినియోగదారులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం రాష్ట్రంలోని రైడ్ షేరింగ్ వ్యవస్థ అంతటా మరింత మెరుగైన కస్టమర్ అనుభవాన్ని తీసుకువస్తుందని భావిస్తున్నారు. ఇక ముంబై, పూణే, నాగ్‌పూర్ వంటి మెట్రో నగరాల్లోని కస్టమర్లు, ముఖ్యంగా రద్దీ సమయాల్లో వాతావరణం సరిగా లేని సమయంలో లేదా క్యాబ్ డ్రైవర్లకు తక్కువ లాభదాయకంగా అనిపించే ప్రాంతాలలో రైడ్ క్యాన్సల్ చేయడం సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకొని కొత్త నిబంధనలను అమలు చేసింది.
Read Also: Rahul Gandhi: “శ్రీరాముడి”పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిందూ వ్యతిరేకి’’ అని బీజేపీ విమర్శలు..
ఇక ఈ రైడ్ రద్దు గురించి పాలసీ ఏమి చెబుతుందన్న విషయానికి వెళితే.. స్టేట్ అగ్రిగేటర్ క్యాబ్స్ పాలసీ 2025 స్పష్టంగా చెప్పేదేంటంటే.. డ్రైవర్ ఒక రైడ్‌ను అంగీకరించి, సరైన కారణం లేకుండా దానిని రద్దు చేస్తే అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్ కస్టమర్‌కు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీ పరిహార విధానాన్ని బట్టి తదుపరి ట్రిప్‌లో పరిహారం చిన్న క్రెడిట్ క్యాష్‌బ్యాక్ లేదా ఛార్జీ తగ్గింపు రూపంలో ఉండేలా చేస్తుంది. మహారాష్ట్రలోని నగరాలు, పట్టణాలలో ప్రధాన సమస్యగా మారిన అనవసరమైన రైడ్ రద్దులను నిరుత్సాహపరచడానికి ఈ నియమం ఉద్దేశించబడింది. అత్యవసర పరిస్థితి లేదా సాంకేతిక సమస్య ఉంటే తప్ప, డ్రైవర్ రైడ్‌ను అంగీకరించిన తర్వాత అతను లేదా ఆమె దానిని గౌరవించాలని ఈ విధానం నొక్కి చెబుతుంది.
Read Also: Greg Abel: వారెన్ బఫెట్ వారసుడిగా ‘గ్రెగ్ అబెల్’.. లక్షల కోట్ల కంపెనీకి కొత్త సీఈఓగా బాధ్యతలు!
రైడ్ రద్దు వల్ల వేలాది మంది రోజువారీ ప్రయాణికులకు అసౌకర్యం కలగడమే కాకుండా.. ముఖ్యమైన సమావేశాలకు హాజరు కాకపోవడం, అలాగే ప్రజల సమయం వృధా కావడం, వినియోగదారులు నిరాశ చెందడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటివరకు డ్రైవర్లకు ఎటువంటి జరిమానా విధించకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారింది. 2025 విధానం ఇప్పుడు అమలులోకి రావడంతో ఓలా, ఉబెర్, రాపిడో తమ డ్రైవర్ల సముదాయాన్ని ఎలా పర్యవేక్షించాలో ఇంకా ఎలా నిర్వహించాలో పునరాలోచించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రయాణికులు ఇప్పుడు చివరి నిమిషంలో రద్దు అవుతుందనే భయం లేకుండా మెరుగైన, నమ్మదగిన సేవను ఆశించవచ్చు.