మహారాష్ట్రలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. నీట్ మాక్ టెస్ట్లో కుమార్తెకు తక్కువ మార్కులు వచ్చాయని ఓ తండ్రి ఘాతుకానికి తెగబడ్డాడు. విచక్షణ మరిచి చెక్క కర్రతో చితకబాదాడు. అనంతరం పట్టించుకోకపోవడంతో కుమార్తె ప్రాణాలు కోల్పోయింది.
ఒక సమూహం లేదా ఓటర్ను సులభంగా గుర్తించేందుకు వీలుగా సీసీ ఫుటేజీలు ఉపయోగపడతాయని ఎన్నికల కమిషన్ తెలిపింది. దీన్ని బహిర్గతం చేయడం వల్ల ఓటు వేసిన వారు, వేయని వారు సామాజిక వ్యతిరేక శక్తుల నుంచి ఒత్తిడికి గురవుతారు అని చెప్పింది.
Pune Bridge Collapses: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. పూణేకి సమీపంలోని ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా, మరో 25మంది పర్యాటకులు గల్లంతయ్యారని తెలుస్తోంది. వర్షాకాలం రద్దీగా ఉండే ప్రసిద్ధి పర్యాటక కేంద్రమైన కుండ్మలలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది.
Minister Narayana: వేస్ట్ టు ఎనర్జీ రంగాన్ని అభివృద్ధి పరచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలలో భాగంగా మంత్రి నారాయణ తాజాగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆధునిక ప్లాంట్లను సందర్శించారు. సోమవారం (జూన్ 9) రాత్రి ఆయన మహారాష్ట్రలోని పింప్రీ చించవాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (PCMC) వద్ద ఉన్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను పరిశీలించారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రతి రోజూ నగర చెత్తను ఆధారంగా చేసుకుని సుమారు 14 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.…
Train Accident: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర విషాదకర ఘటన చోటు చేసుకుంది. రద్దీగా ఉన్న లోకల్ ట్రైన్ నుంచి ప్రయాణికులు జారి పడటంతో ఐదుగురు మృతి చెందగా.. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.
దేశంలో కరోనా విజృంభిస్తోంది. గత వారం కంటే ఈ వారం వేగంగా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ఐదుగురు చనిపోయారు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్కరు చనిపోగా.. మహారాష్ట్రలో ఇద్దరు చనిపోయారు. ఇక దేశ వ్యాప్తంగా 4, 302 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
Military Basic Training: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక వ్యాయామం లాంటి సద్గుణాలు పెంపొందించడానికి బేసిక్ మిలిటరీ శిక్షణ ఇస్తామని ఆ రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ దాదా భూసే పేర్కొన్నారు.
అగ్ని ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈసారి కారులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రభుత్వ టీచర్ సజీవ దహనమయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఉమ్నాబాద్ జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి చెందాడు. నల్గొండ జిల్లా గొల్లగూడకు చెందిన టీచర్ సురేష్ కారులోనే సజీవ దహనమయ్యాడు. షిర్డి…
ఆర్థిక రాజధాని ముంబైలోని ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. ముంబై ఎయిర్పోర్ట్ను పేల్చివేస్తామంటూ అగంతకులు ఫోన్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ముంబై విమానాశ్రయాన్ని పేల్చివేస్తాము అని హెచ్చరించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు మూడు గంటల పాటు ఎయిర్పోర్ట్ను తనిఖీ చేశారు. బాంబు గుర్తింపు బృందాలు, ఇతర భద్రతా సంస్థలు విమానాశ్రయంలో హై అలర్ట్లో ఉన్నాయి. MIDC పోలీసులు కాల్ చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి వేగంగా…