Shocking Video: మహారాష్ట్రలోని సతారా పట్టణంలో ఓ 18 ఏళ్ల యువకుడు ఒక మైనర్ బాలికను బహిరంగంగా కత్తితో బెదిరించిన దారుణ ఘటన చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. యువకుడు బాలిక మెడ వద్ద కత్తి పెట్టి బాలికను బెదిరించడంతో స్థానికులు, పోలీసుల తెలివైన చర్యలతో సురక్షితంగా రక్షించగలిగారు. ఈ గతనకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..
సదరు బాలికతో పాటు అదే కాలనీలో నివసించే యువకుడు ఆమె ప్రేమను తిరస్కరించిందన్న మనస్తాపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బాలిక స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా యువకుడు అడ్డగించి ఆమె మెడపై కత్తితో బెదిరించాడు. ఈ సమయంలో పక్కనే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దైనితో విషయం తెలుసుకున్న సిటీ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ వింగ్ కానిస్టేబుల్ సాగర్ నికమ్, ధీరజ్ మోరే సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని కత్తిని వదిలించేందుకు పది నిమిషాల పాటు మాట్లాడారు. కానీ, ఆ బాలికను యువకుడు వదిలే ప్రయత్నం చేయలేదు.
ఈ సమయంలో ఒక అధికారి ముందుగా యువకుడిని మాట్లాడిస్తూ.. అతడి దృష్టి మరల్చేలా చేశాడు. దానితో వెంటనే మరో అధికారి వెనక నుంచి చాకచక్యంగా వెళ్లి అతని చేతిలో ఉన్న కత్తిని పట్టుకొని బాలికను అతడి చేతిలో నుంచి తొలగించారు. వెంటనే బాలికను అక్కడి నుండి బయటకు తీసుకువచ్చారు. బాలికను కాపాడిన తర్వాత అక్కడున్న జనాలు ఆ యువకుడిపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. పోలీసులు అతన్ని ప్రజల ఆగ్రహం నుంచి రక్షించేందుకు కష్టపడాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత చివరకు అతన్ని శహూపురి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Kadapa Central Jail: కడప కేంద్ర కారాగారంలో ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు!
ఈ సంఘటనపై సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ సచిన్ మేత్రే ఇద్దరినీ జిల్లా ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. అనంతరం అదే సాయంత్రం షహూపురి పోలీస్ స్టేషన్‌లో సదరు వ్యక్తిపై ఫిర్యాదు జరిగింది. ప్రాథమికంగా యువకుడి చర్యకు కారణం బాలిక ప్రేమను తిరస్కరించడమేనని భావిస్తున్నారు. ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
**Minor Girl in Maharashtra's Satara Threatened with Knife by 18-Year-Old Youth**
An 18-year-old youth allegedly threatened a 10th-grade minor girl by holding a knife to her neck in Satara, Maharashtra.
The accused had been persistently pressuring the girl to reciprocate… pic.twitter.com/W4P3nCbNQc
— India Brains (@indiabrains) July 22, 2025