మహారాష్ట్రలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మరాఠీ భాష మాట్లాడలేదన్న కారణంతో ఆటో డ్రైవర్‌పై కొందరు భౌతికదాడికి దిగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రీల్స్ కోసం కొండ చివరన కారుతో స్టంట్లు చేయడం స్టార్ట్ చేశాడు. ఒక్కసారిగా అదుపు తప్పడంతో 300 అడుగుల లోయలో జారీ పడింది. ఈ ఘటనలో సాహిల్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సాయంతో సహాయక బృందాలు అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో పర్యాటక ప్రదేశాల్లో ఇలాంటి విన్యాసాలు చేయొద్దని పోలీసులు టూరిస్టులను కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.
Shiv Sena MLA: ముంబైలో హాస్టల్ క్యాంటీన్లో నాసిరకం భోజనం పెట్టారని శివసేన (షిండే) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ క్యాంటిన్ సిబ్బందిపై దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ వివాదం సద్దుమణగక ముందే ఇవాళ (గురువారం) దక్షిణ భారతీయులను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన.
Maharashtra: మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో అవమానకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్ బాత్రూమ్లో రక్తపు మరకలు కనిపించడంతో 12 ఏళ్ల పైబడిన అందరూ బాలికలను హాల్ లోకి నిలబెట్టి.. పీరియడ్స్ ఉన్నవారు ఒకవైపు, లేనివారు మరో వైపుగా విడదీశారు.
భార్యాభర్తల బంధంలో అక్రమ సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. పరాయి వ్యక్తుల మోజులో పడి భర్తలను అంతమొందిస్తున్నారు కొందరు భార్యలు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ, ప్రియుడితో కలిసి మంచం పట్టిన భర్తను దిండుతో గొంతు నులిమి హత్య చేసి, దానిని సహజ మరణంలా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దిశా రామ్టేకే (30), చంద్రసేన్ రామ్టేకే (38) 13 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు.…
Nagpur: నాగ్‌పూర్‌లో అత్యంత దారుణమైన గ్యాంగ్ ‘‘ఇప్పా గ్యాంగ్’’. ఈ గ్యాంగ్ లీడర్ భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడు ఓ గ్యాంగ్ మెంబర్. ఇంకేముంది, తన లీడర్నే మోసం చేసిన వ్యక్తిని చంపేందుకు ఏకంగా 40 మంది కరడుగట్టిన హంతకముంఠా అతడి కోసం వెతుకుతోంది. సదరు మహిళ, తాను ఎఫైర్ పెట్టుకున్న వ్యక్తితో బయటకు వెళ్లిన సమయంలో రోడ్డు ప్రమాదంలో మరణించడం ముఠా ఆగ్రహాన్ని మరింత పెంచింది.
మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యయనం వెలుగుచూసింది. దాయాదులుగా ఉన్న అన్నాదమ్ముళ్లిద్దరూ 20 సంవత్సరాల తర్వాత ఒక్కటయ్యారు. మరాఠీ భాష కోసం ఒకే వేదిక పంచుకున్నారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లోనే ఇది సరికొత్త చరిత్రగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
Maharashtra: మహారాష్ట్రలో ప్రతిపక్షాలు ‘‘హిందీ విధింపు’’ను వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివారం త్రిభాషా విధానంపై సవరించిన ప్రభుత్వ తీర్మానాన్ని (GR) రద్దు చేసింది. విధానాన్ని సమీక్షించి, కొత్తగా అమలు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
Pregnant Woman: మహారాష్ట్రలోని జల్నా జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ప్రసవ సమయంలో గర్భిణీ స్త్రీ పొత్తికడుపుపై యాసిడ్ పోశారనే ఆరోపణలు వచ్చాయి. ప్రసవ సమయంలో మెడికల్ జెల్లీకి బదులుగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ రుద్దారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై శనివారం అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.
త్రిభాషా రగడ ఇప్పుడు తమిళనాడు నుంచి మహారాష్ట్రకు మళ్లింది. త్రిభాషా విధానాన్ని ఇప్పటికే తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో మహాయతి ప్రభుత్వం 1-5 తరగతుల్లో మరాఠీ, ఆంగ్లంతో పాటు హిందీని తప్పని చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.