Maharashtra: కారుతో స్టంట్లు.. అదుపుతప్పి 300 అడుగుల లోయలో పడిన యువకుడు
- వీడియో కోసం కారుతో విన్యాసం.. 300 అడుగుల లోయలో పడిపోయిన యువకుడు..
- ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడి స్థానిక ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స..
- మహారాష్ట్రలోని పఠాన్ కొండపై కారుతో యువకుడు చేసిన స్టంట్లు సోషల్ మీడియాలో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు చేస్తున్న చిత్ర విచిత్రమైన విన్యాసాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతుంది. బహిరంగ ప్రదేశాల్లో చేసే విన్యాసాలతో ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు. మహారాష్ట్రలోని ఓ టూరిజం ప్రదేశంలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. వివరాల్లోకి వెళితే.. పఠాన్- సదావాఘాపుర్ మార్గంలోని ఓ కొండ పైన బుధవారం నాడు కరాడ్‌లోని గోలేశ్వర్‌కు చెందిన సాహిల్ జాదవ్, తన ఫ్రెండ్స్ తో కలిసి ఈ ప్లేస్ కి వచ్చాడు. రీల్స్ కోసం కొండ చివరన కారుతో స్టంట్లు చేయడం స్టార్ట్ చేశాడు. ఒక్కసారిగా అదుపు తప్పడంతో 300 అడుగుల లోయలో జారీ పడింది. ఈ ఘటనలో సాహిల్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సాయంతో సహాయక బృందాలు అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో పర్యాటక ప్రదేశాల్లో ఇలాంటి విన్యాసాలు చేయొద్దని పోలీసులు టూరిస్టులను కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.
Read Also: Bhahubali The Epic : ‘బాహుబలి – ది ఎపిక్’ రన్ టైం ఎంతో తెలుసా..!
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
అయితే, గుజర్వాడి ప్రాంతంలోని పఠాన్ నుంచి 3-4 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ టూరిజం ప్లేస్ లో నిత్యం పర్యాటకులతో సందడిగా కనిపిస్తుంది. పెద్ద లోయగా ఉండే ఈ ప్రాంతంలో భద్రతాపరమైన మౌలిక సదుపాయాలు మాత్రం కనపడవు. దీంతో ఇక్కడ గతంలోనూ పలు ప్రమాదాలు జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇక్కడ వెంటనే భద్రతా రెయిలింగ్‌లు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
મહારાષ્ટ્ર: પહાડ પર કાર સ્ટંટ ભારે પડ્યો !!
ગુજરવાડીમાં 'ટેબલ પોઈન્ટ' પર સ્ટંટ કરતી વખતે કારે કાબુ ગુમાવ્યો અને 300 ફૂટ ઊંડી ખીણમાં પડી, વીડિયો વાયરલ
ઘટનામાં 3 ઘાયલ, એકની હાલત ગંભીર#Maharashtra #Satara #Carstunt #Reversewaterfall #viralvideo pic.twitter.com/Vs7NJI3y0T
— Jaimin Vanol (@VanolJaimin99) July 10, 2025
తాజావార్తలు
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..